Bangalore: సాయిబాబా ఆలయానికి డ్రైఫ్రూట్స్‌తో వినూత్న అలంకరణ
ABN, First Publish Date - 2023-07-04T11:37:52+05:30
బెంగళూరు జేపీ నగర్‌లోని సత్యగణపతి షిర్డీ సాయి ట్రస్టు(Shirdi Sai Trust) ఆధ్వర్యంలో వినూత్న కార్య
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): గురు పూర్ణిమను పురస్కరించుకుని బెంగళూరు జేపీ నగర్‌లోని సత్యగణపతి షిర్డీ సాయి ట్రస్టు(Shirdi Sai Trust) ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమాలను నిర్వహించింది. ఆలయ ప్రాంగణాన్ని, స్వామివారిని డ్రైఫ్రూట్స్‌తో అందంగా అలంకరించారు. ఈ సందర్భంగా జరిగిన ధార్మిక విధి విధానాల్లో పాలుపంచుకునేందుకు సోమవారం నగరం నలుమూలల నుంచి వందలామంది భక్తులు ఆలయానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా సత్యగణపతి షిర్డీ సాయి ట్రస్టుకు చెందిన ట్రస్టీ రామమోహన్‌రాజు మీడియాతో మాట్లాడుతూ సాయిబాబాకు అలంకరించిన వస్తువులు, పదార్ధాలను భక్తులే సమర్పించారని, తిరిగి ఈ పదార్ధాలను భక్తులకు ప్రసాదం రూపంలోనే అందజేస్తున్నామన్నారు. భక్తులు స్పందించి 20వేల కొబ్బరికాయలు, 2,500 పనసపండ్లు, 5వేల కిలోల బెల్లం, 25వేలకు పైగా ఎండు ఖర్జూర పండ్లు, కిలోల కొద్దీ బాదం, జీడిపప్పు, కిస్మిస్ ఇదితర ఎన్నో రకాల డ్రైఫ్రూట్స్‌ను అందజేశారని ఆయన తెలిపారు. తెల్లవారు జాము నుంచే ఈ ఆలయంలో ప్రత్యేక అభిషేకం, హోమం వంటి కైంకర్యాలను నిర్వహించారు. రాత్రి 10 గంటల వరకు ఆలయంలో రద్దీ కొనసాగింది.
Updated Date - 2023-07-04T11:37:52+05:30 IST