Bank Holidays: 6 రోజుల పాటు బ్యాంకులు బంద్.. ఖాతాదారులకు బిగ్ అలెర్ట్..!
ABN, First Publish Date - 2023-11-20T11:39:01+05:30
సాధారణంగా బ్యాంకులకు పండుగలు, పబ్లిక్ హాలిడేస్ కారణంగా సెలవులు వస్తుంటాయి. కానీ ఇప్పుడు మాత్రం వాటితో సంబంధం లేకుండా బ్యాంకులు మూతబడనున్నాయి.
దేశంలో అన్ని రకాల లావాదేవీలు సాఫీగా జరగడంలో బ్యాంకులు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. ఆర్థిక సంబంధ విషయాలన్నీ బ్యాంకుల ఆధారంగా జరుగుతాయి. నేరుగా బ్యాంకులకు వెళ్లి పనులు చక్కబెట్టుకునేవారికి బ్యాడ్ న్యూస్. సాధారణంగా బ్యాంకులకు పండుగలు, పబ్లిక్ హాలిడేస్ కారణంగా సెలవులు వస్తుంటాయి. కానీ ఇప్పుడు మాత్రం వాటితో సంబంధం లేకుండా బ్యాంకులు బంద్ కు పిలుపిచ్చాయి. అసలు ఈ బ్యాంకుల సమ్మె ఏంటి? ఎప్పటి నుండి ఉంటుంది? ఏ బ్యాంకులు సమ్మెలో పాల్గొంటాయి. బ్యాంకు ఖాతాదారులు తీసుకోవలసిన ముందు జాగ్రత్తలు ఏంటి? తెలుసుకుంటే..
దేశానికి ఆర్థిక సేవలు అందించడంలో బ్యాంకులు ఎప్పుడు ముందుంటాయి. కానీ బ్యాంకు ఉద్యోగస్తులు తమ డిమాండ్లను నెరవేర్చాలనే కారణంతో దేశవ్యాప్తంగా సమ్మెకు(bank strike) సిద్దమయ్యారు. ఆలిండియా బ్యాంక్ ఉద్యోగుల సంఘం(AIBEA) సెక్రటరీ సీహెచ్ వెంకటాచలం ఈ సమ్మెకు గల ప్రధాన కారణాలు చెప్పారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల వల్ల కస్టమర్ల ఫ్రైవసీకి ప్రమాదం ఉంటుందని, అందుకే అవుట్ సోర్సింగ్ రిక్రూట్మెంట్ తగ్గించాలని ఈ డిమాండ్ లలో ఒకటిగా ఉంది. వాటికి బదులుగా రిటైర్మెంట్లు, ఉద్యోగస్తుల మరణాలు వంటి కారణంతో ఏర్పడే ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది మాత్రమే కాకుండా వారంలో కేవలం 5రోజులు మాత్రమే పనిదినాలు ఉండాలనే డిమాండ్, వేతనాల పెంపు మొదలైనవి వీరి లిస్ట్ లో ఉన్నాయి. ఇందుకు గానూ వచ్చే నెలలో అంటే.. డిసెంబర్ నెలలో సమ్మె చేపట్టనున్నారు. ఈ సమ్మె 6రోజుల పాటు జరగనుంది. ఈ విషయాన్ని ఆలిండియా బ్యాంక్ ఉద్యోగుల సంఘం నోటిఫికేషన్ రూపంలో తెలియజేసింది. ఇకపోతే బ్యాంకులు చేపట్టనున్న ఈ సమ్మెలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాలకు చెందిన పలు బ్యాంకులు పాల్గొంటున్నాయి. అయితే అన్ని బ్యాంకులు ఒక్కసారే కాకుండా ఒక్కో రోజు కొన్ని బ్యాంకుల చొప్పున సమ్మె చేపడుతున్నాయి. డిసెంబర్ 4 నుండి 11 వరకు జరగనున్న ఈ సమ్మెలో ఏ బ్యాంకు ఎప్పుడు స్ట్రైక్ లో పాల్గొంటుందంటే..
ఇది కూడా చదవండి: Dates: చలికాలంలో వీటిని తప్పకుండా ఎందుకు తినాలంటే..!
డిసెంబర్ 4 : పంజాబ్ నేషనల్ బ్యాంక్. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగులు సమ్మెలో ఉంటారు.
డిసెంబర్ 5: బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగులు దేశవ్యాప్త సమ్మెలో పాల్గొంటారు.
డిసెంబర్ 6: కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగులు దేశవ్యాప్త సమ్మెలో పాల్గొంటారు.
డిసెంబర్ 7: ఇండియన్ బ్యాంక్, యూకో బ్యాంక్ ఉద్యోగులు దేశవ్యాప్త సమ్మెలో పాల్గొంటారు.
డిసెంబర్ 8: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఉద్యోగులు దేశవ్యాప్త సమ్మెలో పాల్గొంటారు.
డిసెంబర్ 11: డిసెంబర్ 11వ తేదీన అన్ని ప్రైవేట్ బ్యాంకులు దేశవ్యాప్తంగా సమ్మెలో పాల్గొంటాయి.
ఇది కూడా చదవండి: ఖాళీ కడుపుతో అస్సలు తినకూడని ఆహారాలు..
Updated Date - 2023-11-20T11:39:03+05:30 IST