ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Bathing: రోజుకు రెండుసార్లు స్నానం చేస్తున్నా సరే.. అందరూ కామన్‌గా చేసే ఒకే ఒక్క మిస్టేక్ ఇదే.. తప్పు చేస్తున్నామని తెలియకుండానే..!

ABN, First Publish Date - 2023-06-14T10:54:58+05:30

మనిషి దినచర్యలో స్నానం ఒక భాగమైపోయింది . ఉదయం స్నానం చేసి టిఫిన్లు గట్రా కానిచ్చి ఆ తరువాత ఉద్యోగాలు, కాలేజీలు, స్కూళ్ళకు బయల్దేరుతారు, కొందరు సాయంత్రం ఇంటికి వచ్చాక రిలాక్స్ గా ఉండటానికి సాయంత్రం కూడా స్నానం చేస్తారు. ఇలా రోజుకు రెండు సార్లు స్నానం చేస్తున్నా సరే.. తమకే తెలియకుండా ఓ పెద్ద మిస్టేక్ చేసేస్తున్నారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మనిషి దినచర్యలో స్నానం ఒక భాగమైపోయింది . ఉదయం స్నానం చేసి టిఫిన్లు గట్రా కానిచ్చి ఆ తరువాత ఉద్యోగాలు, కాలేజీలు, స్కూళ్ళకు బయల్దేరుతారు, కొందరు సాయంత్రం ఇంటికి వచ్చాక రిలాక్స్ గా ఉండటానికి సాయంత్రం కూడా స్నానం చేస్తారు. ఇలా రోజుకు రెండు సార్లు స్నానం చేస్తున్నా సరే.. తమకే తెలియకుండా ఓ పెద్ద మిస్టేక్ చేసేస్తున్నారు అందరూ. శరీరాన్ని బాడీ వాష్ లు, సోప్ లతో పదే పదే రుద్దుకుంటూ శుభ్రపరుచుకునేవారు అదే శరీరంలో కొన్ని భాగాల విషయంలో చాలా నిర్లక్ష్యంగా ఉంటారు. పైగా వాటికి పెద్ద ప్రాధాన్యత లేదని అనుకోవడం మరీ పెద్ద తప్పు. అందరూ నిర్లక్ష్యం చేస్తున్న ఆ శరీరభాగాలు ఏంటి? తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటి? పూర్తీగా తెలుసుకుంటే..

శరీరానికి పట్టిన మురికిని వదిలించుకోవడానికే స్నానం చేస్తుంటాం. అయితే ఈ మురికి మొత్తం చివరికి పాదాల(Foots) మీదగానే బయటకు వెళ్లిపోతుంది. కానీ చాలా మంది పాదాలు, కాలి గోర్ల విషయంలో చాలా నిర్లక్ష్యంగా ఉంటారు. అసలు స్నానం చేస్తున్నప్పుడు ఒకటికి రెండుసార్లు సోప్ పెట్టుకుని రుద్ది రుద్ది స్నానం చేసినా చివరలో పాదాల మీద రెండు చెంబుల నీళ్లు తూతూ మంత్రంగా పోసుకుని బయటకు వచ్చేస్తుంటారు. ఇంటా, బయటా తిరగడానికి మనకు పాదాలే ఆధారం. దుమ్ము, ధూళి,ట్రాఫిక్ లలోనూ, వర్షం నీటిలోనూ ఇలా చెప్పుకుంటూ వెళితే పాదాలు, కాలి గోర్లలో చాలా మురికి చేరిపోయి ఉంటుంది. బయటకు వెళ్లొచ్చినప్పుు ఫేస్ వాష్ లతో ముఖాన్ని శుభ్రం చేసుకోవడానికి ఇచ్చినంత ప్రాధాన్యత పాదాలు శుభ్రం చేసుకోవడానికి ఎవరూ ఇవ్వరు. ఈ కారణంగానే పాదాల పగుళ్లు, పాదాల పుండ్లు (Foot cracks, foot ulcers) మొదలయినవి చాలా ఈజీగా వచ్చేస్తున్నాయనే విషయం చాలా మందికి తెలియదు.

Fridge: ఫ్రిజ్‌లోంచి దుర్వాసన వస్తోందా..? వీటిని పాటించండి చాలు.. 30 నిమిషాల్లో ఆ చెడు వాసన మటాష్..!


కొంతమంది మహిళలు పెడిక్యూర్(pedicure) పేరుతో పాదాలను శుభ్రం చేసుకుంటూ ఉంటారు. గోళ్ళను కత్తిరించి గోళ్ళ రంగు వేసుకుంటూ ఉంటారు. ఈ కారణంగా పాదాలను శుభ్రపరుచుకునేవారు చాలా తక్కువ. సుమారు 50శాతం మంది స్నానం చేసేటప్పుడు పాదాలను కడగరు. దీనికారణంగా కాలి వేళ్ల మధ్య దురద, పుండ్లు వంటివి వచ్చి ఇబ్బందికరమైన సమస్యగా మారుతుంది. స్నానం చేసేటప్పుడు పాదాలను ప్రతిరోజు సబ్బుతో కడగాలి. కాలి వేళ్ల మధ్య మురికి పేరుకుని ఉంటుంది. దీన్ని సున్నితంగా శుభ్రం చేసుకోవాలి. కాలివేలి గోర్లను నెల లేదా రెండు నెలలకు ఒకసారి కట్ చేసి కాసింత కొబ్బరి నూనె లేదా మాయిశ్చరైజర్ రాసుకోవాలి. సాక్స్ లు, షూస్ వేసుకునేముందు పాదాలు శుభ్రంగా తడిగా లేకుండా ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఇలా పాదాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

Viral Video: ఎర్రటి ఎండలో రోడ్డు పక్కన పడిపోయి ఉన్న ఒంటె.. ఏంటా అని వాహనాన్ని ఆపి వెళ్లి చూశాడో డ్రైవర్.. అసలు విషయం గ్రహించి..!


Updated Date - 2023-06-14T10:54:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising