Beer-powered Motorcycle: ఒక్క బాటిల్ బీరు పడ్డాక ఈ బైక్ తో మామూలుగా ఉండదు.. దీని వేగమెంతో తెలిస్తే..
ABN, First Publish Date - 2023-05-12T13:27:12+05:30
ఓ బాటిల్ బీరు పడితే చాలు రయ్యిమని రంకెలు వేస్తుందట. బీరు పడ్డాక కుర్రాళ్ళే కాదండోయ్ ఈ బైక్ కూడా యమా స్పీట్ తో రెచ్చిపోతుందట. దీని స్పీడెంతో తెలిసుకుని సోషల్ మీడియాలో కుర్రాళ్లు నోళ్ళు వెళ్ళబెడుతున్నారు.
అబ్బాయిలకు బీరన్నా, మోటర్ సైకిలన్నా చెప్పలేనంత ఇష్టం. ఇవి రెండూ లేని లైఫ్ ను ఇప్పటికాలం కుర్రాళ్ళు అసలు ఊహించుకోలేరేమో.. అయితే ఇప్పుడు ఈ రెండు ఒక్కటయ్యాయి. పాలు నీళ్లలా, ఆకు వక్కలా.. బీరు బైకూ కలిసిపోయాయి. ఓ కుర్రాడు కొత్త బైక్ కనిపెట్టాడు. దీనికి పెట్రోలు అక్కర్లేదు. ఓ బాటిల్ బీరు పడితే చాలు రయ్యిమని రంకెలు వేస్తుందట. బీరు పడ్డాక కుర్రాళ్ళే కాదండోయ్ ఈ బైక్ కూడా యమా స్పీట్ తో రెచ్చిపోతుందట. దీని స్పీడెంతో తెలిసుకుని సోషల్ మీడియాలో కుర్రాళ్లు నోళ్ళు వెళ్ళబెడుతున్నారు. బీరుతో నడిచే ఈ బైకు గురించి పూర్తీ వివరాల్లోకి వెళితే..
యూఎస్(US) లో బ్లూలింగ్టన్(Bloomington) లో కేవై మైఖేల్సన్ అనే కుర్రాడు నివసిస్తున్నాడు. ఈ కుర్రాడు ఎప్పుడూ ప్రత్యేకంగా ఆలోచిస్తూంటాడు. ఆ ఆలోచనలోనే ఇతను బీరుతో నడిచే బైక్(beer powered bike) ఆవిష్కరించాడు. ఈ బైక్ చాలా విభిన్నంగా ఉంది. సాధారణంగా పెట్రోల్ తో నడిచే బైక్(petrol bike) లు, పెట్రోల్ అవసరం లేకుండా విద్యుత్ మోటార్(electric motor bike) తో నడిచే బైక్ లు చూసి ఉంటాం. విదేశాలలో గ్యాస్ సహాయంతో కార్లు, బైకులు నడుస్తాయి. కానీ మైఖేల్ మాత్రం బీరుతో నడిచే బైక్ తయారుచేశాడు. ఇతను బైక్ ను ఇంకా రోడ్డు మీద రైడింక్ కు తీసుకెళ్ళలేదు. వీడియోలో మైఖేల్ తన గ్యారేజ్ లో బైక్ ను ఒక చెక్క పలక మీద బలంగా కట్టేశాడు. బైక్ ఫ్యూయల్ ట్యాంక్ లో ఒక బాటిల్ బీర్(pour the beer in fuel tank) పోశాడు. ఆ తరువాత దానికున్న వైర్లను జాయింట్ చేయగా బైక్ వెనుక భాగంలో సర్రున పొగ లేచింది. ఈ బైక్ గంటకు 150మైళ్ళ వేగాన్ని అందుకోగలదని మైఖేల్ చెబుతున్నాడు. అంటే 250కిలోమీటర్ల వేగమన్నమాట.
Hot Water: ఆరోగ్యానికి మంచిది కదా అని వేడినీరు తాగుతున్నారా? ఇన్ని సమస్యలు ముంచుకొస్తాయని తెలిస్తే..
అసలే కుర్రాళ్లకు స్ఫీడ్ బైకులంటే పిచ్చి. మైఖేల్ ఆవిష్కరించిన బైక్ గురించి తెలియగానే కుర్రాళ్ల కళ్ళు మెరుస్తున్నాయి. కాగా మైఖేల్ ఇదివరకే రాకెట్-పవర్డ్ టాయిలెట్(rocket powered toilet), జెట్-పవర్డ్ కాఫీ పాట్(jet powered coffee pot) లను కూడా కనిపెట్టాడు. ఇప్పుడు బీరుతో నడిచే బైకును కనిపెట్టడానికి కారణం అతనికి తాగే అలవాటు లేదట. దీంతో బీరును ఇలా ఉపయోగించచ్చనే ఐడియా వచ్చి ఆవిష్కరణ చేశాడట.
Farting: నలుగురిలోకి వెళ్ళాలన్నా ఇబ్బంది పడేంతగా గ్యాస్ ఇబ్బంది పెడుతోందా? ఈ టిప్స్ పాటిస్తే చాలు..
Updated Date - 2023-05-12T13:27:12+05:30 IST