ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈ ప్రభుత్వమేంటి ఇలాంటి నిర్ణయం తీసుకుంది? ఆడవాళ్ళూ అక్కడ నగ్నంగా ఉండచ్చట.. అసలు విషయమేంటంటే..

ABN, First Publish Date - 2023-03-13T16:13:53+05:30

ఈ నిర్ణయం విని ఎంతోమంది ముక్కున వేలేసుకుంటున్నారు. ఇదేం విడ్డూరం అని బుగ్గలు నొక్కుకుంటున్నారు. కానీ అక్కడ మహిళలు మాత్రం పండగ చేసుకుంటున్నారు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

చాలామందికి నీళ్ళలో ఎంజాయ్ చేయడం చాలా ఇష్టం. మనమైతే వేసవితో చిన్నప్పుడు ఈత కొట్టేవాళ్ళం, పెద్దయ్యాక దానికి దూరమయ్యాం కానీ, అక్కడి ప్రభుత్వం మాత్రం ఇలా నీళ్ళలో ఈత కొట్టే విషయంలో ఓ నిర్ణయం వెలిబుచ్చింది. ఆడవారూ నగ్నం(Naked)గా పబ్లిక్ స్విమ్మింగ్ ఫూల్ లో ఈతకొట్టచ్చంటూ చేసిన అనౌన్స్ దుమారం రేపుతోంది. ఈ నిర్ణయం విని ఎంతోమంది ముక్కున వేలేసుకుంటున్నారు. ఇదేం విడ్డూరం అని బుగ్గలు నొక్కుకుంటున్నారు. కానీ ఇలా నిర్ణయం తీసుకోవడం వెనుక ఓ అమ్మాయి ఉందట. ఆమె వల్లే ఇలాంటి చట్టం చేశారని అంటున్నారు. ఇంతకూ ఈ నిర్ణయమెక్కడ జరిగింది? ఆ అమ్మాయి ఏం చేసింది? వివరంగా తెలుసుకుంటే..

జర్మనీ(Germany) దేశం బెర్లిన్(Berlin) లో ఓ పబ్లిక్ స్విమ్మింగ్ ఫూల్(Swimming pool) లో ప్రజలందరూ ఈత కొడుతున్నారు. అప్పుడే అక్కడికి ఓ మహిళ వచ్చింది. మగవాళ్ళలా ఆమె టాప్ లెస్ గా తయారై స్విమ్మింగ్ ఫూల్ లోకి దూకింది. ఆమె అలా చేయడంతో అక్కడున్నవారందరూ అవాక్కయ్యారు. మహిళలు ఇలా అర్దనగ్నంగా పబ్లిక్ స్విమ్మింగ్ ఫూల్ లో ఈతకొట్టమేంటి అని అక్కడివారు కన్నెర్ర చేశారు. వెంటనే ఆ మహిళను స్విమ్మింగ్ ఫూల్ నుండి బయటకు గెంటేశారు. తనను అలా గెంటేయడంతో ఆ మహిళ ఉగ్రురాలైంది. స్విమ్మింగ్ ఫూల్ నుండి తనను గెంటేయడం వివక్ష కిందకు వస్తుందని తనకు న్యాయం కావాలని కోర్టుకెక్కింది. గత ఏడాది డిసెంబర్ నెలలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించి వాదోపవాదాలు ఇన్నిరోజులూ జరిగాయి. తాజాగా ఈ కేసులో తీర్పు వెలువడింది.

జర్మనీలో మొదటే స్వేచ్చ ఎక్కువగా ఉంటుంది. మహిళలు కొన్ని సందర్భాలలో నగ్నంగా కనిపించినా అది సబబేనని అక్కడివారి భావన. ఈ మహిళకు సంబంధించిన విషయంలోకూడా కోర్టు అదే కోణంలో ఆలోచించింది. సదరు మహిళ టాప్ లెస్ గా స్విమ్మింగ్ ఫూల్ లో ఈతకొట్టడం తప్పేం కాదని తీర్పు ఇచ్చింది. కేవలం ఆ మహిళకు మాత్రమే కాకుండా అక్కడి మహిళలందరూ నగ్నంగా ఈత కొట్టవచ్చంటూ అనుమతి జారీచేసింది. దీంతో అక్కడి మహిళలు చాలా ఆనందాన్ని వ్యక్తం చేశారు. కాగా జర్మనీ-బెర్లిన్ పర్యటనకు వెళ్ళాలనే ఆలోచన ఉన్న పర్యాటకులు మాత్రం అక్కడికి వెళ్లడానికి కాస్త జంకుతున్నారని సోషల్ మీడియో సమాచారం. స్విమ్మింగ్ ఫూల్ ల దగ్గర దుస్తులు లేకుండా నగ్నంగా పురుషులు, స్త్రీలు కనిపిస్తుంటే ఎవరైనా ఆ ప్రాంతాలను ఎలా ఎంజాయ్ చెయ్యగలరు అని అంటున్నారు.

Read also: నేను అత్తారింటికి వెళ్ళనని కార్లోంచి దిగిపోయిన నవవధువు.. వరుడికి ఆ సమస్య ఉందని అర్థమవడం వల్లే..


Updated Date - 2023-03-13T16:17:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising