ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డేగలు, రాబందులు మాత్రమే వేటాడుతాయనుకుంటున్నారా? అయితే ఎంతో ముద్దుగా కనిపించే ఈ పక్షి వేటాడే తీరు చూస్తే... గుండెదడ పట్టుకుంటుంది..!

ABN, First Publish Date - 2023-05-01T13:37:35+05:30

పక్షులలో సాధారణంగా డేగలు, రాబందులు, గద్దలు మాత్రమే వేటాడుతాయని అనుకుంటాం. అయితే ఈ కోవలో మరో జాతి చిన్న పక్షులు(Small birds) కూడా ఉన్నాయి. అవి వాటి పరిమాణంలోనూ, చూసేందుకు ఎంతో ముద్దుగా, అమాయకంగా కనిపిస్తాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పక్షులలో సాధారణంగా డేగలు, రాబందులు, గద్దలు మాత్రమే వేటాడుతాయని అనుకుంటాం. అయితే ఈ కోవలో మరో జాతి చిన్న పక్షులు(Small birds) కూడా ఉన్నాయి. అవి వాటి పరిమాణంలోనూ, చూసేందుకు ఎంతో ముద్దుగా, అమాయకంగా కనిపిస్తాయి. కానీ అవి ఎంతో ప్రమాదకరమైనవి(dangerous). అవి తాము వేటాడబోయే జంతువును నిముషాల్లో ఉక్కిరిబిక్కిరి చేసి చంపేస్తాయి. ఈ వేటాడే పక్షి పేరు బ్లాక్ థిగ్డ్ ఫాల్కనెట్(Black-thighed Falconet). ఆడిటీ వెబ్‌సైట్ తెలిపిన వివరాల ప్రకారం ఇది పక్షులను, ఇతర జీవును వేటాడుతుంది.

పరిమాణంలో ఇది పిచ్చుక మాదిరిగా ఉంటుంది. బ్లాక్ థిగ్డ్ ఫాల్కనెట్ పరిమాణం 14 నుండి 16 సెంటీమీటర్ల వరకు ఉంటుంది. బరువు(weight) కొన్ని గ్రాములు మాత్రమే ఉంటుంది. ఎంతో అందంగా కనిపించే ఈ పక్షి సాధారణంగా పలు కీటకాలు, చిమ్మటలు, సీతాకోకచిలుకలు(Butterflies), చెదపురుగులను వేటాడుతుంది. అయితే ఇది క్రూరంగానూ ప్రవర్తిస్తుంది. ఒక్కోసారి ఇది చిన్నపాటి పక్షులు, బల్లులు, చిన్న సైజు గబ్బిలాలను(Bats) వేటాడుతుంది.

బ్లాక్ థిగ్డ్ ఫాల్కోనెట్‌ను సామాజిక పక్షిగా పరిగణిస్తారు. ఇది ఎక్కువగా మందలలో ఉంటూ వేటాడుతుంది. సాధారణంగా ఒక మందలో 10 పక్షులు ఉంటాయి. బ్లాక్ టైడ్ ఫాల్కనెట్ బ్రూనై, ఇండోనేషియా(Indonesia), మయన్మార్, మలేషియా, సింగపూర్, థాయిలాండ్ తదితర దేశాల్లో కనిపిస్తుంది.

Updated Date - 2023-05-01T13:37:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising