ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Health: ఉడకబెట్టిన గుడ్డు vs ఆమ్లెట్.. దేనిలో ఎక్కువ పోషకాలుంటాయి? ఆరోగ్యానికి ఏది మేలు చేస్తుంది?

ABN, First Publish Date - 2023-11-18T14:28:43+05:30

ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఇష్టపడే ఆహార పదార్థాలలో గుడ్లు కూడా ఒకటి. గుడ్డు మంచి పోషకాహారంగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందింది. ప్రపంచవ్యాప్తంగా చాలా మందిని గుడ్డును ఉడికించో లేదా ఆమ్లెట్‌గా వేసుకునో తింటుంటారు. అయితే ఈ రెండింటిలో ఏది మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది?

ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఇష్టపడే ఆహార పదార్థాలలో గుడ్లు (Eggs) కూడా ఒకటి. గుడ్డు మంచి పోషకాహారంగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందింది. ఒక గుడ్డులో సుమారుగా 72 కేలరీలు, 6 గ్రాముల ప్రొటీన్లు (Proteins), 5 గ్రాముల ఆరోగ్యకర కొవ్వులు, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ప్రోటీన్స్ విషయానికి వస్తే చాలా మంది ఆధారపడేది గుడ్డు మీదనే. గుడ్డుతో ఎన్నో రకాల వంటలు తయారు చేసుకోవచ్చు. అయితే ప్రపంచవ్యాప్తంగా చాలా మందిని గుడ్డును ఉడికించో (Boiled egg) లేదా ఆమ్లెట్‌గా (Omelette) వేసుకునో తింటుంటారు. అయితే ఈ రెండింటిలో ఏది మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది? (Food and Health)

గుడ్లలో అధిక నాణ్యత గల ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఉడకబెట్టడం అనే ప్రక్రియ గుడ్డులోని చాలా పోషకాలను సంరక్షిస్తుంది. గుడ్డులో ఉండే విటమిన్లు B12, D, రిబోఫ్లావిన్‌లు, అమైనో ఆమ్లాలు, ప్రోటీన్లు ఉడకబెట్టడం వల్ల శరీరానికి తగినట్టు సరళంగా మారతాయి. సులభంగా జీర్ణమవుతాయి. ఉడికించిన గుడ్లలో కోలిన్ అనే పోషకం మెదడు ఆరోగ్యానికి, అభివృద్ధికి సహాయపడుతుంది. ఉడకబెట్టిన గుడ్డును తినడం అంటే మంచి పోషకాహారాన్ని తీసుకోవడమే.

Viral Video: వారెవ్వా.. ఈ టెక్నిక్ సూపర్ బాసూ.. డ్రిల్లింగ్ మెషిన్‌తో జ్యూస్ ఎలా తయారు చేశాడో చూడండి..

గుడ్డును పగలగొట్టి వేసే ఆమ్లెట్ కూడా మంచి ఆహారమే. అయితే ఆమ్లెట్ వేసేటపుడు అదనంగా నూనె లేదా ఇతర పదార్థాలు కలుపుతారు. అందువల్ల పోషకాలతో పాటు కొంత చెడు కొలస్ట్రాల్ కూడా శరీరంలోకి చేరుతుంది. అలాగే నూనె వేసి వేయించడం వల్ల కొన్ని పోషకాలు కూడా పోయే ప్రమాదం ఉంది. అయితే ఆమ్లెట్‌కు కొన్నిసార్లు జోడించే కూరగాయలు వల్ల మంచి కూడా జరుగుతుంది. ఏదేమైనా గుడ్డును ఆమ్లెట్ రూపంలో తీసుకోవడం కంటే ఉడకబెట్టి తినడం చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

Updated Date - 2023-11-18T14:28:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising