ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Randeep Hooda: తీవ్ర గాయాల పాలైన బాలీవుడ్ నటుడు

ABN, First Publish Date - 2023-01-14T15:32:43+05:30

బాలీవుడ్ నటుడు రణ్‌దీప్ హుడా (Randeep Hooda) తీవ్ర గాయాల పాలయ్యాడు. హార్స్ రైడింగ్ చేస్తున్న సమయంలో కళ్లు తిరగడంతో జారి పడి పోయాడు. రణ్‌ దీప్ ప్రస్తుతం స్వీయ దర్శకత్వం వహిస్తూ ‘స్వతంత్ర వీర్ సావర్కర్’ (Swatantra Veer Savarkar) చిత్రంలో నటిస్తున్నాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలీవుడ్ నటుడు రణ్‌దీప్ హుడా (Randeep Hooda) తీవ్ర గాయాల పాలయ్యాడు. హార్స్ రైడింగ్ చేస్తున్న సమయంలో కళ్లు తిరగడంతో జారి పడి పోయాడు. రణ్‌ దీప్ ప్రస్తుతం స్వీయ దర్శకత్వం వహిస్తూ ‘స్వతంత్ర వీర్ సావర్కర్’ (Swatantra Veer Savarkar) చిత్రంలో నటిస్తున్నాడు. ఈ మూవీలో టైటిల్ రోల్ పోషిస్తున్నాడు. అందు కోసం దాదాపుగా 22కేజీల బరువు తగ్గాడు. భారీగా బరువు తగ్గడంతో హార్స్ రైడింగ్ చేస్తున్న సమయంలో జారి పడి ఎడమ కాలికి తీవ్ర గాయమయింది. ఫలితంగా రణ్‌దీప్‌ను చికిత్స కోసం ముంబైలోని కోకిలాబెన్ ధీరూబాయ్ ఆస్పత్రికీ తరలించారు. వైద్యులు సర్జరీ అవసరమని చెప్పినట్టు తెలుస్తోంది. రాధే సెట్‌లోను ఈ బాలీవుడ్ నటుడికి గతంలోను గాయాలయ్యాయి. అప్పుడు కూడా కుడి కాలికి గాయమయింది.

రణ్‌దీప్ హుడా బాలీవుడ్‌కు చెందిన అనేక సినిమాల్లో నటించాడు. హైవే చిత్రంలో అతడి నటనకు విమర్శకుల ప్రశంసలతో పాటు అభిమానుల మన్ననలు దక్కాయి. ‘హీరోయిన్’, ‘కిక్’, ‘సరబ్‌ జిత్’ వటి చిత్రాలతో అన్ని వర్గాల ప్రేక్షకులకు చేరువయ్యాడు. క్యాట్ (CAT) అనే వెబ్‌సిరీస్‌లోను నటించాడు. ఇన్‌స్పెక్టర్ అవినాష్ అనే షోలోను నటిస్తున్నాడు. హైవే సినిమాలోని నటనకు గాను ప్రొడ్యూసర్స్ గిల్డ్ అవార్డును కూడా గెలుచుకున్నాడు.

Updated Date - 2023-01-14T15:32:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising