Wife-Husband: భార్యాభర్తలిద్దరికీ జాబ్స్.. ఇంటి పని విషయంలో గొడవలు.. విడాకులు కోరుతూ హైకోర్టుకెళ్తే..!
ABN, First Publish Date - 2023-09-13T17:11:35+05:30
వైవాహిక జీవితంలో భార్యాభర్తలది సమాన పాత్ర అని పైకి చెప్పినా, ఇంటి పనులన్నీ భార్యే చేయాలని చాలా మంది భావిస్తుంటారు. మహిళలు ఒకవైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు ఇంటి పనులు, పిల్లల బాధ్యతలు కూడా నిర్వర్తిస్తుంటారు. అయితే ఇంటి పనులను పంచుకోవాలన్నందుకు విడాకులు కోరిన భర్తకు బాంబే హైకోర్టు బుద్ధి చెప్పింది.
వైవాహిక జీవితంలో భార్యాభర్తలది సమాన పాత్ర అని పైకి చెప్పినా, ఇంటి పనులన్నీ భార్యే (Wife) చేయాలని చాలా మంది భావిస్తుంటారు. మహిళలు ఒకవైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు ఇంటి పనులు, పిల్లల బాధ్యతలు కూడా నిర్వర్తిస్తుంటారు. అయితే ఇంటి పనులను పంచుకోవాలన్నందుకు విడాకులు (Divorce) కోరిన భర్తకు (Husband) బాంబే హైకోర్టు (Bombay High Court )బుద్ధి చెప్పింది. ఇంటి బాధ్యతలన్నీ భార్యే నిర్వర్తించాలనే ఆలోచన ఆదిమ మనస్తత్వానికి చెందినదని బాంబే హైకోర్టు తన తీర్పులో పేర్కొంది. భార్య ప్రవర్తనతో విసిగిపోయానని, ఆమె నుంచి విడాకులు కావాలని కోరుతూ మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి 2018లో పుణెలోని ఫ్యామిలీ కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేశాడు.
ఆ పిటీషన్‌ను విచారించిన ఫ్యామిలీ కోర్టు 2020లో తిరస్కరించింది. దీంతో ఆ వ్యక్తి హైకోర్టును ఆశ్రయించాడు. భార్య తన తల్లితో రోజంతా ఫోన్‌లో మాట్లాడుతుందని, తనను మానసికంగా వేధిస్తోందని పిటీషన్‌లో పేర్కొన్నాడు. జస్టిస్ నితిన్ సాంబ్రే, జస్టిస్ షర్మిలా దేశ్‌ముఖ్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. భర్త వేసిన పిటీషన్‌ను తిరస్కరించింది. ఇంటి పనులన్నీ భార్యే చేయాలనే ఆలోచనను మార్చుకోవాలని సూచించింది. అంతేకాదు తల్లితో ఫోన్‌లో మాట్లాడడం నేరం కాదని పేర్కొంది.
Viral Video: లగ్జరీ కారుకు దూరంగా ఉండి ఫొటోను తీసేందుకు ప్రయత్నిస్తున్నాడో వ్యక్తి.. కారు ఓనర్ రియాక్షన్ చూస్తే..!
పెళ్లి జరిగిన తర్వాత ఆమెను తన కుటుంబ సభ్యులతో మాట్లాడనీయకపోవడం దారుణమని, వివాహానంతరం స్త్రీని తన తల్లిదండ్రుల నుంచి పూర్తిగా విడదీయలేమని ధర్మాసనం పేర్కొంది. అలాగే భార్యాభర్తల మధ్య గొడవల్లో పదునైన పదాలు, పరుష పదాలు వాడడం సర్వసాధారణమని పేర్కొంది. దీనిని క్రూరత్వంగా పరిగణించలేమని పేర్కొంటూ విడాకులు పిటీషన్‌ను కొట్టేసింది. కాగా, ఈ జంటకు 2010లో వివాహం జరిగింది. వీరికి ఓ కూతురు జన్మించింది.
Updated Date - 2023-09-13T17:11:35+05:30 IST