ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral News: 10 రోజులపాటు సెలవు కావాలంటూ బాస్‌కు మెసేజ్.. 2 నిమిషాల్లో ఓకే అంటూ మెసేజ్.. నెటిజన్ల డౌట్ ఏంటంటే..!

ABN, First Publish Date - 2023-09-16T17:33:52+05:30

ప్రస్తుతం ఆడ, మగ అనే తేడా లేకుండా అందరూ ఉద్యోగాలు చేస్తున్నారు. కార్పొరేట్ ప్రపంచంలో సవాళ్లను, ఒత్తడిని కలిసి ఎదుర్కొంటున్నారు. ఇలాంటి బిజీ బిజీ ఉద్యోగ జీవితాల నుంచి ఒక్క రోజు సెలవు దొరకడం చాలా కష్టం. సెలవు కావాలని అడిగితే బాస్‌ల నుంచి వచ్చే సమాధానాలు మామూలుగా ఉండవు.

ప్రస్తుతం ఆడ, మగ అనే తేడా లేకుండా అందరూ ఉద్యోగాలు (Jobs) చేస్తున్నారు. కార్పొరేట్ ప్రపంచంలో సవాళ్లను, ఒత్తడిని కలిసి ఎదుర్కొంటున్నారు. ఇలాంటి బిజీ బిజీ ఉద్యోగ జీవితాల నుంచి కాస్త విరామం దొరకడం గగనమే. ఒక్క రోజు సెలవు (Leave) దొరకడం చాలా కష్టం. సెలవు కావాలని అడిగితే బాస్‌ (Boss)ల నుంచి వచ్చే సమాధానాలు మామూలుగా ఉండవు. అయితే తాజాగా ఓ మహిళకు సెలవు విషయంలో షాకింగ్ అనుభవం ఎదురైంది. ఆమె తన బాస్‌తో చేసిన వాట్సాప్ స్క్రీన్ షాట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది (Viral Tweet).

ఆకాంక్ష దుగాడ్ అనే మహిళ ఆ స్క్రీన్ షాట్‌ను షేర్ చేసింది. వైరల్ అవుతున్న ఆ ట్వీట్‌లో ఆమె తన బాస్ పూజకు సెలవు (10 days leave) కావాలని కోరుతూ మెసేజ్ చేసింది. ``హాయ్ పూజ.. ఈ నెల 15వ తేదీన నేను ఓ ట్రిప్‌నకు వెళ్లాల్సి ఉంది. నాకు ఈ నెల 15 నుంచి 25 వరకు సెలవు దొరుకుతుందా`` అని మెసేజ్ చేసింది. అందుకు బాస్ స్పందిస్తూ.. ``సరే.. సరదాగా గడుపు`` అని రిప్లై వచ్చింది. అంతవరకు బాగానే ఉంది కానీ, ఆ తర్వాత బాస్ మరో రెండు మెసేజ్‌లు పంపించి వాటిని వెంటనే డిలీట్ చేసింది. ఆ డిలీట్ మెసేజ్‌లు ఎంటి అనేది పెద్ద క్వశ్చన్ మార్క్‌గా మారింది.

Viral: ఆటోలో వెళ్తూ ఫోన్‌ మాట్లాడుతోంటే.. సడన్‌గా బైక్‌పై ఇద్దరు కుర్రాళ్ల ఎంట్రీ.. కళ్లు తెరచి చూసే లోపే షాకింగ్ సీన్..!

ఆ స్క్రీన్ షాట్‌ను ట్విటర్‌లో 5.6 లక్షల మందికి పైగా వీక్షించారు. ఆ ట్వీట్‌పై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ``ఆ డిలీట్ మెసేజ్‌లు ఏంటి తెలుసుకోవాలని చాలా ఆత్రుతగా ఉంది``, ``నువ్వు మళ్లీ ఆఫీస్‌కు రానవసరం లేదు. అక్కడే ఉండిపో`` అని బాస్ మెసేజ్ చేసి ఉంటుంది, ``ఆ రెండు మెసేజ్‌ల్లో.. నిన్ను ఉద్యోగంలో నుంచి తీసేశాం. పది రోజుల తర్వాత కూడా రానవసరం లేదు అని ఉండుంటుంది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Updated Date - 2023-09-16T17:33:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising