ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Bachelor's: ఉద్యోగాలు చేసే బ్యాచులర్స్.. మీక్కూడా ఇలాంటి పరిస్థితి ఎప్పుడైనా ఎదురైందా..? బాస్‌తో ఈ కుర్రాడి చాటింగ్ చదివితే..!

ABN, First Publish Date - 2023-06-30T15:56:30+05:30

ప్రైవేట్ సంస్థలో ఉద్యోగాలు చేసే వ్యక్తులు ఎదుర్కొనే సమస్యలు అన్నీ ఇన్నీ కావు. ఇష్టం ఉన్నా లేకపోయినా బాస్ చెప్పినట్టు చేయాల్సిందే. లేకపోతే కష్టాలు తప్పవు. తాజాగా ఓ యువకుడు రెడిట్‌లో షేర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రైవేట్ సంస్థలో ఉద్యోగాలు (Jobs) చేసే వ్యక్తులు ఎదుర్కొనే సమస్యలు అన్నీ ఇన్నీ కావు. ఇష్టం ఉన్నా లేకపోయినా బాస్ చెప్పినట్టు చేయాల్సిందే. లేకపోతే కష్టాలు తప్పవు. తాజాగా ఓ యువకుడు రెడిట్‌లో షేర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీక్ ఆఫ్ (week off) రోజున పనిలోకి రావాల్సిందిగా ఆ యువకుడిని (Employee) బాస్ ఆదేశించాడు. ఆ రోజు తనకు వేరే పని ఉందని, ఆ యువకుడు చెప్పినా ఆ బాస్ (Boss) పట్టించుకోకుండా ఆర్గ్యుమెంట్ చేశాడు. దీంతో ఆ యువకుడు తన ఉద్యోగానికి రాజీనామా (Resignation) చేశాడు.

తన బాస్, తన మధ్య జరిగిన వాట్సాప్ స్క్రీన్ షాట్‌లను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ స్క్రీన్ షాట్ ప్రకారం.. వీకాఫ్ రోజు డ్యూటీకి రావాల్సిందిగా ఉద్యోగికి బాస్ సందేశం పంపాడు. అయితే వీకాఫ్ కాబట్టి తను కొన్ని పనులు పెట్టుకున్నానని, తాను డ్యూటీకి రాలేనని, బ్రియాన్ అనే వ్యక్తికి కాల్ చేయాలని విజ్ఞప్తి చేశాడు. దానికి బాస్ స్పందిస్తూ.. ``బ్రియాన్ వివాహితుడు. ఓ కొడుకు కూడా ఉన్నాడు. అతడిని డ్యూటీకి రమ్మని చెప్పలేను. నువ్వు సింగిల్‌. ఎందుకు రాలేవు?`` అని అడిగాడు.

తనకు వారంలో ఉండేది ఒక్క రోజు సెలవు అని, ఆ రోజు ఏం చేయాలో ముందుగా నిర్ణయించుకున్నానని, కావాలంటే మధ్యాహ్నం షిఫ్ట్‌కు వస్తానని ఆ ఉద్యోగి చెప్పాడు. అయినా ఆ బాస్ తన తీరు మార్చుకోలేదు. మార్నింగ్ షిఫ్ట్‌కు రావాల్సిందేనని పట్టు పట్టాడు. దాంతో ఆ ఉద్యోగికి సహనం నశించింది. ``నేను ఇక మీ దగ్గర పని చేయలేను. మనకి నాలుగేళ్లుగా పరిచయం ఉంది. నేను క్రమశిక్షణగా పని చేస్తానని మీకు తెలుసు. అయినా మీరు ఇలా మాట్లాడుతున్నారు. దీనిని నా రెండు వారాలో నోటీస్ పీరియడ్‌గా పరిగణించండి. మీరు నన్ను ఉద్యోగంలో నుంచి తీసెయ్యకుంటే మిమ్మల్ని సోమవారం కలుస్తాన``ని మెసేజ్ చేశాడు. ఈ మెసేజ్ చూసిన నెటజన్లు ఆ బాస్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2023-06-30T15:56:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising