Viral Video: వివాహ సమయంలో భారీ వర్షం.. వధూవరులు ఏం చేశారో చూస్తే మాత్రం షాకవడం ఖాయం!
ABN, First Publish Date - 2023-05-09T15:58:26+05:30
వివాహాలు స్వర్గంలో నిశ్చయమవుతాయి అంటారు. అలా నిశ్చయమైన వివాహాలు ఎన్ని ఆటంకాలు ఎదురైనా అనుకున్న సమయానికి జరిగిపోతాయి. సాధారణంగా వివాహం వంటి భారీ కార్యక్రమాలను ప్లాన్ చేసినపుడు రకరకాల అవాంతరాలు ఎదురవుతుంటాయి.
వివాహాలు స్వర్గంలో నిశ్చయమవుతాయి అంటారు. అలా నిశ్చయమైన వివాహాలు ఎన్ని ఆటంకాలు ఎదురైనా అనుకున్న సమయానికి జరిగిపోతాయి. సాధారణంగా వివాహం (Marriage) వంటి భారీ కార్యక్రమాలను ప్లాన్ చేసినపుడు రకరకాల అవాంతరాలు ఎదురవుతుంటాయి. వివాహం కోసం ఘనంగా ఏర్పాట్లు చేసుకుంటే భారీ వర్షాలు కురిసి (Heavy rainfall) అవన్నీ నాశనమవుతాయి. తాజాగా ఓ జంటకు అలాంటి అనుభవమే ఎదురైంది. అయితే వారు ఆ సమస్యను చాలా చక్కగా పరిష్కరించుకున్నారు.
వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ జంట వివాహానికి భారీ వర్షం అడ్డుగా నిలిచింది. వివాహ వేదిక వద్దకు వెళ్లేందుకు వధువు (Bride), వరుడు (Groom) గొడుగుల కింద నిల్చుని వర్షం ఎప్పుడు తగ్గుతుందా అని ఎదురు చూస్తున్నారు. అయితే వర్షం అంతకంతకూ పెరుగుతూనే ఉంది. అప్పటికే వివాహ వేదిక వద్ద నృత్యకారులు వర్షంలోనే ప్రదర్శన ఇస్తున్నారు. వధూవరులు కూడా వర్షంలోనే తడుచుకుంటూ వారి దగ్గరకు వెళ్లి ఫోజులిచ్చారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
Viral Video: క్షణాల్లో కుప్పకూలిన బ్రిడ్జ్.. చప్పట్లు కొట్టిన స్థానికులు.. వైరల్ అవుతున్న వీడియో!
ఆ వీడియోకు ``నిజమైన ప్రేమికుల వివాహాన్ని ఏదీ ఆపలేదు`` అని క్యాప్షన్‌ను జత చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా (Viral Video) మారింది. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ``ప్రకృతి కూడా వారి కలయికను ఘనంగా సెలబ్రేట్ చేసింది``, ``ఆ జంటపై దేవతలు ఆశీర్వాదాలు కురిపించారు``, ``వర్షంలో వివాహం.. అద్భుతమైన వేడుక`` అని కామెంట్లు చేశారు.
Updated Date - 2023-05-09T15:58:26+05:30 IST