Bride: వరుడి ప్రవర్తన చూసి వధువుకు అనుమానం.. లెక్కపెట్టమని రూ.10 నోట్లు ఇచ్చిన వధువు.. పెళ్ళిమంటపంలో సినిమా ట్విస్ట్..!
ABN, First Publish Date - 2023-03-30T15:22:09+05:30
అందంగా అలంకరించిన పెళ్ళిమండపంలో పెళ్ళితంతు జరుగుతుండగా పెళ్ళికూతురుకు పెళ్ళికొడుకు మీద డౌటొచ్చింది. తన సందేహం తీర్చుకోవడానికి 10రూపాయల నోట్లు తెప్పించి
పెళ్ళంటే..బంధుమిత్రులు, శ్రేయోభిలాషుల సమక్షంలో ఎంతో సంతోషంగా జరిగే వేడుక. దురదృష్టం కొద్ది ఈ మధ్యకాలంలో పెళ్ళిళ్ళలో ఎవరూ ఊహించని సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. పెళ్ళికొడుకులోనో, పెళ్ళికూతురు లోనో విభిన్న కోణాలు బయటపడుతుంటాయి. అందంగా అలంకరించిన పెళ్ళిమండపంలో పెళ్ళితంతు జరుగుతుండగా పెళ్ళికూతురుకు పెళ్ళికొడుకు మీద డౌటొచ్చింది. తన సందేహం తీర్చుకోవడానికి 10రూపాయల నోట్లు తెప్పించి అతని చేతుల్లో పెట్టి లెక్కబెట్టమని చెప్పింది.అథితుల సాక్షిగా సినీఫక్కీలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..
ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) రాష్ట్రం ఫరూఖాబాద్(Farrukhabad) జిల్లాకు చెందిన రెండు కుంటుంబాలు తమ పిల్లల పెళ్ళి నిర్ణయించుకున్నాయి. ఎంతో అందంగా అలంకరించిన పెళ్ళిమండపంలో.. బంధుమిత్రుల సమక్షంలో పెళ్ళితంతు జరుగుతోంది. పెళ్లి తంతు చేయిస్తున్న పురోహితుడికి పెళ్ళి కొడుకు ప్రవర్తనలో ఏదో తేడా కనిపించింది. ఆయన వెంటనే తల వంచుకుని పెళ్ళితంతు చేస్తున్న పెళ్ళికూతురికి తన అనుమానం చెప్పాడు. ఆయన అలా చెప్పగానే పెళ్ళికూతురు పెళ్ళికొడుకును గమనించడం మొదలుపెట్టింది. కొన్ని నిమిషాల్లోనే పురోహితుడు చెప్పింది నిజమేనని ఆమెకు అర్థమైంది. తన సందేహం తీర్చుకోవడానికి తన కుటుంబ సభ్యులను పిలిచి 10 రూపాయలు నోట్లు ఇవ్వమని చెప్పింది. వాళ్ళు ముప్పై పదిరూపాయల నోట్లు ఆమెకు ఇచ్చారు. ఆమె వాటిని పెళ్ళికొడుకు చేతిలో పెట్టి 'లెక్కపెట్టి ఇది ఎంత ఉందో చెప్పండి' అనింది.
పెళ్ళికొడుకు ఆ నోట్లను లెక్కపెట్టడంలో విఫలం అయ్యాడు. పురోహితుడు, పెళ్ళికూతురు అనుమానించినట్టుగానే పెళ్ళికొడుకుకు మానసిక సమస్య ఉందని అర్థమయ్యింది. అథితుల సాక్షిగా నిజం మొత్తం బయటపడింది. పెళ్ళికొడుకుకు మానసిక సమస్య ఉన్న విషయాన్ని అబ్బాయి కుటుంబ సభ్యులు అమ్మాయి కుటుంబానికి అసలు చెప్పలేదట. విషయాన్ని దాచిపెట్టి వారు పెళ్ళికి సిద్దమయ్యారు. ఇలాంటి వ్యక్తిని నేను పెళ్ళిచేసుకోనంటూ పెళ్ళివేదిక దిగి అక్కడినుండి వెళ్ళిపోయింది వధువు. ఆమె అలా వెళ్ళడంతో ఇరుకుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. కానీ ఆ తరువాత అమ్మాయి కుటుంబం పెళ్ళి ఆగిపోయిందనే బాధ కంటే.. ముందే అబ్బాయి గురించి తెలియడం మంచిదైందని, అలాంటి వ్యక్తితో పెళ్ళి జరిగి ఉంటే జీవితాంతం బాధపడాల్సి వచ్చేదని సమాధానపడ్డారు. పెళ్ళి ఆగిపోవడంతో పెళ్ళికొడుకు కుటుంబ సభ్యులు వచ్చినదారినే వెనుదిరిగి వెళ్ళిపోయారు.
Updated Date - 2023-03-30T15:22:09+05:30 IST