Bride: అత్తారింటికి వెళ్తుండగా సడన్‌గా కారును ఆపమన్న వధువు.. ఈ భర్త నాకొద్దంటూ తిరిగి పుట్టింటికి.. అసలేం జరిగిందంటే..!
ABN, First Publish Date - 2023-12-07T14:08:10+05:30
కారులోనే పరుడు చేసిన పనికి దారి మధ్యలోనే కారు దిగి పుట్టింటికెళ్లిన నవ వధువు.. అసలు కారణం ఇదీ..
ప్రపంచంలోని అన్ని దేశాలు పెళ్ళిని చాలా ప్రత్యేకంగా నిర్వహిస్తాయి. ఇక భారతదేశంలో పెళ్లిళ్లు పెద్ద పండుగ లాంటివి. చిన్న, మధ్య తరగతి కుటుంబాలు కూడా తమ పిల్లల పెళ్లిళ్లు బాగా గ్రాండ్ గానే జరుపుతున్నాయి. ఆ తల్లిదండ్రులు తమ కూతురి పెళ్లి ఏర్పాట్లను చాలా ఘనంగా చేశారు. బంధుమిత్రులు, స్నేహితుల సమక్షంలో సంతోషంగా పెళ్లి జరిగింది. అంతా అయ్యాక అమ్మాయిని వరుడి చేతుల్లో పెట్టి అత్తారింటింకి సాగనంపారు. కానీ వధువు మాత్రం మార్గం మధ్యలోనే కారు ఆపించి పుట్టింటికి తిరిగెళ్లింది. వరుడు చేసిన పనికి ఈ భర్త నాకొద్దంటూ తల్లిదండ్రుల ముందు విలపించింది. ఈ సంఘటనకు సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..
బీహార్(Bihar) రాష్ట్రంలో పెళ్లివేడుక తర్వాత వధువు షాకింగ్ నిర్ణయం తీసుకుంది. బీహార్ రాష్టం శరన్ జిల్లాలో గర్ఖా మండలం, మోతీ రాజ్ పూర్ గ్రామానికి చెందిన యువతికి అదే జిల్లా భగవాన్ పూర్ ప్రాంతానికి చెందిన యువకుడితో పెళ్ళి నిశ్చయం అయ్యింది. వరుడు అతని కుటుంబ సభ్యులు, బంధువులు అందరూ భగవాన్ పూర్ నుండి మోతీ రాజ్ పూర్ కు పెళ్లి కోసం ఊరేగింపుగా వచ్చారు. వధువు తరపువారు ఘనంగా ఆహ్వానించారు. వరుడి తరపున వారు ఆ రోజు రాత్రి అక్కడే నిద్ర చేశారు. మరుసటిరోజు పెళ్ళి తంతు మొదలై సజావుగా ముగిసింది. అనంతరం అప్పగింతల సమయంలో వరుడు తూలుతుండటంతో వధువు భయపడి అతని నుండి దూరం జరిగింది. కానీ వరుడి కుటుంబ సభ్యులు మాయ మాటలు చెప్పి అప్పగింతల కార్యక్రమం ముగించారు. అనంతరం అమ్మాయిని వరుడితో అత్తారింటికి పంపారు.
ఇది కూాడా చదవండి: Cauliflower vs Cabbage: కాలీఫ్లవర్ మంచిదా..? క్యాబేజీ తినాలా..? ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్ అంటే..!
భర్తతో కలసి కారులో వెళ్తున్న వధువుకు వరుడు మద్యం సేవించినట్టు అర్థమైంది. ఆమె మొదటే అసౌకర్యంతో ఉండగా వరుడు కారులోనే అభ్యంతకర పనులు చేయడం మొదలు పెట్టాడు. దీంతో వధువు కారు ఆపమని చెప్పి కారు దిగి ఏడ్చుకుంటూ పుట్టింటికి పరుగుతీసింది. నాకు ఈ భర్త వద్దేవద్దంటూ తల్లిదండ్రుల దగ్గర వాపోయింది. వధువు మధ్యలోనే దిగి వెళ్ళిపోవడంతో వరుడి కుటుంబ సభ్యులు షాకయ్యారు. వెంటనే వారు వెనుదిరిగి వధువు ఇంటికి చేరుకున్నారు. ఇరు కుటుంబాలు వాదించుకోవడంతో అక్కడ గందరగోళం ఏర్పడింది. చివరకు పంచాయితీ కూడా జరిగింది. ఎవరెంత చెప్పినా వధువు వరుడితో అత్తారింటికి వెళ్లబోనని తేల్చి చెప్పడంతో వరుడి కుటుంబం కోడలు లేకుండానే ఇంటికి పయనమయ్యింది. కాగా.. వరుడు మద్యం సేవించిన మాట వాస్తవమేనని, కానీ అతను కారులో ఎలాంటి అభ్యంతకర పనులు చేయలేదని వరుడి తరపున వారు వాదిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Smartphones: పాత ఫోన్లను అమ్మేస్తున్నా.. ఎక్ఛేంజ్ చేస్తున్నారా..? ఈ 5 విషయాలను అస్సలు మర్చిపోవద్దు..!
Updated Date - 2023-12-07T14:08:12+05:30 IST