Viral video: పెళ్లి వేదికపై వరుడి ఎదురుగా వధువు క్యూట్ డ్యాన్స్.. అతడి రియాక్షన్ ఏంటంటే..
ABN, First Publish Date - 2023-03-05T21:05:02+05:30
ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెళ్లిళ్ల (Wedding) సీజన్ నడుస్తోంది.. వివాహాల్లో జరిగే ఫన్నీ ఘటనలు, ఆసక్తికర దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెళ్లిళ్ల (Wedding) సీజన్ నడుస్తోంది.. వివాహాల్లో జరిగే ఫన్నీ ఘటనలు, ఆసక్తికర దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇటీవలి కాలంలో పెళ్లి వేదికలపై వధువు డ్యాన్స్ చేయడం అనేది ట్రెండ్‌గా మారిపోయింది. కాబోయే భర్త ముందు వధువు డ్యాన్స్ చేస్తున్న వీడియోలు ఇప్పటికే ఎన్నో వచ్చాయి. తాజాగా అదే తరహాలో మరో వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది (Wedding Video).
Viral Video: నేను దేశభక్తుడిని.. మోదీ భక్తుడిని కాదు.. ట్రైన్‌లో పొలిటికల్ పంచ్‌లు పేల్చుతున్న చిరు వ్యాపారి.. అతడిని ఎందుకు అరెస్ట్ చేశారంటే..
ఈ వీడియోలో.. అందంగా ముస్తాబైన వధువు పెళ్లి వేదిక ఎక్కి అందరి ఎదుటా వరుడి ముందు డ్యాన్స్ చేసింది. పలు బాలీవుడ్ పాటలు ప్లే అవుతుండగా వధువు అద్భుతంగా డ్యాన్స్ చేసి వరుడిని ఆకట్టుకుంది (Bride’s Superb dance performance before groom). వధువు డ్యాన్స్ చేస్తుంటే వరుడు చిరునవ్వుతో ఆమెను అభినందిస్తూ చూస్తుండిపోయాడు. వేదిక కింద ఉన్న బంధువులు, కుటుంబ సభ్యులు చప్పట్లతో వధువుని ప్రోత్సహించారు. ఆ వీడియో (Viral Video) సోషల్ మీడియా జనాలను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
Updated Date - 2023-03-05T21:12:06+05:30 IST