Costly Car: భారత్‌లో అత్యంత ఖరీదైన కారు ధరెంతో తెలుసా ? దాన్ని తీసుకున్నది ఎవరంటే?
ABN, First Publish Date - 2023-12-11T12:42:37+05:30
దేశంలో అత్యంత ఖరీదైన కారు ధరెంతో మీకు తెలుసా. అక్షరాలా రూ.14 కోట్లు. అది తీసుకున్నది సంపన్నులైన ముఖేష్ అంబానో, అనిల్ అంబానో, రతన్ టాటా, గౌతమ్ అదానో అని అనుకుంటున్నారా.
ఢిల్లీ: దేశంలో అత్యంత ఖరీదైన కారు(Expensive Car) ధరెంతో మీకు తెలుసా. అక్షరాలా రూ.14 కోట్లు. అది తీసుకున్నది సంపన్నులైన ముఖేష్ అంబానో, అనిల్ అంబానో, రతన్ టాటా, గౌతమ్ అదానో అని అనుకుంటున్నారా. అలా అయితే మీరు తప్పులో కాలేసినట్లే. కారు కొనుగోలు చేసింది బెంగళూరులో ఉంటున్న ఓ కంపెనీ ఎండీ. ఆ విశేషాలేంటంటే.. బ్రిటిష్ బయోలాజికల్స్ మేనేజింగ్ డైరెక్టర్ వీఎస్ రెడ్డి(VS Reddy)కి యవ్వనం నుంచే మార్కెట్లో వచ్చిన కొత్త మోడల్ కార్లను కొనుగోలు చేయడం అంటే మక్కువ.
బ్రిటన్ చెందిన కార్ల తయారీ కంపెనీ బెంట్లీ బ్రాండ్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఇటీవల బెంట్లీ ముల్సాన్ EWB సెంటనరీ ఎడిషన్ కార్ ను సంస్థ విడుదల చేసింది. బెంట్లీ 100వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ మోడల్ని పరిమిత ఎడిషన్లలో రిలీజ్ చేసింది. దీని ఖరీదు రూ.14 కోట్లు. వీఎస్ రెడ్డి దీన్ని ఎలాగైనా దక్కించుకోవాలని భావించారు. అనుకున్నదే తడవుగా షోరూంకెళ్లి కారు కొనుగోలు చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
కారు ప్రత్యేకతలివే..
కంపెనీ ఈ బ్రాండ్ కార్లను ప్రపంచవ్యాప్తంగా 100కుమించి ఎక్కువ ఉత్పత్తి చేయలేదు. 6 హెచ్‌పీ 1020 Nm టార్క్‌తో 6.75-లీటర్ కెపాసిటీ కలిగిన V8 ఇంజిన్ ని ఇది కలిగిఉంది. దీనికి 8-స్పీడ్ ZF ఆటోమేటెడ్ గేర్‌బాక్స్ అనుసంధానించారు. 5.5 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వేగాన్ని అందుకుంటుంది.
గరిష్ఠ వేగ పరిమితి గంటకు 296 కి.మీ. కావడం మరో విశేషం. బ్రిటీష్ బయోలాజికల్స్ కంపెనీని అన్ని వయసుల వారికి తక్కువ ఖర్చుతో పోషకాహారాన్ని ఉత్పత్తి చేసేందుకు వీఎస్ రెడ్డి స్థాపించారు.
Updated Date - 2023-12-11T12:47:42+05:30 IST