కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

RS.2000 Currency: రూ.2 వేల నోట్లు మీ దగ్గర ఇప్పటికీ ఉన్నాయా? ఈజీ పద్ధతిలో మార్చుకోండిలా

ABN, First Publish Date - 2023-11-02T18:11:29+05:30

రూ.2 వేలను మార్చుకోవాలని ఆర్బీఐ విధించిన గడువు అక్టోబర్ 7తో ముగిసింది. అయితే నోట్లు మార్చుకునేందుకు ఆర్బీఐ(RBI) మళ్లీ రెండు ఛాన్స్‌లు కల్పించింది. ప్రస్తుతం మీ దగ్గర 2 వేల నోట్లు(RS.2000 Notes)ఉంటే.. పోస్ట్ ఆఫీస్ నుంచి ఆర్బీఐకి నగదు పంపుకోవచ్చు. Insured Post ద్వారా నగదును పంపవచ్చు. తద్వారా అకౌంట్లో సదరు నగదు జమ అవుతుందని అధికారులు తెలిపారు. లోకల్ ఆఫీసులకు దూరంగా ఉన్న వారికి ఈ ఛాన్స్ కల్పిస్తున్నట్లు ఆర్బీఐ తెలిపింది.

RS.2000 Currency: రూ.2 వేల నోట్లు మీ దగ్గర ఇప్పటికీ ఉన్నాయా? ఈజీ పద్ధతిలో మార్చుకోండిలా

ఢిల్లీ: రూ.2 వేలను మార్చుకోవాలని ఆర్బీఐ విధించిన గడువు అక్టోబర్ 7తో ముగిసింది. అయితే నోట్లు మార్చుకునేందుకు ఆర్బీఐ(RBI) మళ్లీ రెండు ఛాన్స్‌లు కల్పించింది. ప్రస్తుతం మీ దగ్గర 2 వేల నోట్లు(RS.2000 Notes)ఉంటే.. పోస్ట్ ఆఫీస్ నుంచి ఆర్బీఐకి నగదు పంపుకోవచ్చు. Insured Post ద్వారా నగదును పంపవచ్చు. తద్వారా అకౌంట్లో సదరు నగదు జమ అవుతుందని అధికారులు తెలిపారు. లోకల్ ఆఫీసులకు దూరంగా ఉన్న వారికి ఈ ఛాన్స్ కల్పిస్తున్నట్లు ఆర్బీఐ తెలిపింది. దీంతో పాటు ట్రిపుల్ లాక్ రిసెప్టాకిల్ పద్ధతిలో రూ.2 వేలను మార్చుకునే ఛాన్స్ ఉంది. టీఎల్ఆర్(TLR) దరఖాస్తు నింపి ఆర్బీఐకి పంపిస్తే.. కస్టమర్ అకౌంట్లో మనీ డిపాజిట్ అవుతుంది. ఆర్బీఐ ప్రాంతీయ డైరెక్టర్(Regional Director) రోహిత్ దాస్ మాట్లాడుతూ.. ఇన్స్యూర్డ్ పోస్ట్(Insured Post) ద్వారా నోట్లను పంపితే అమౌంట్ సేఫ్ గా చేరుకుంటుందని.. కస్టమర్లు బ్యాంకు చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన అవసరం లేదని, క్యూలో నిలబడే బాధలు అంతకన్నాఉండవని అన్నారు.


ఇన్స్యూర్డ్, టీఎల్ఆర్ విధానాలు చాలా సేఫ్ అని స్పష్టం చేశారు. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందనవసరం లేదని వెల్లడించారు. ఢిల్లీ(Delhi)లోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫీస్ కు 700 టీఎల్ఆర్ ఫాంలు వచ్చాయని తెలిపారు. ఢిల్లీలోని ప్రాంతీయ కార్యాలయంలో సీనియర్ సిటిజన్లు, దివ్యాంగుల కోసం ప్రత్యేక లైన్ ఏర్పాటు చేసినట్లు ఆర్బీఐ తెలిపింది. 2 - 3 నోట్లు మార్చుకునేవారి కోసం స్పెషల్ లైన్ ఉన్నట్లు చెప్పారు. రూ. 2 వేల కరెన్సీ నోట్లను సెప్టెంబర్ 30లోగా మార్చుకోవాలని లేదా బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేయాలని అధికారులు గడువు విధించారు. తర్వాత, గడువును అక్టోబర్ 7 వరకు పొడిగించారు. బ్యాంకుల్లో అక్టోబర్ నెలతో డిపాజిట్లు నిలిపేశారు. అహ్మదాబాద్, బెంగళూరు, బేలాపూర్, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, గౌహతి, హైదరాబాద్, జైపూర్, జమ్మూ, కాన్పూర్, కోల్‌కతా, లక్నో, ముంబై, నాగ్‌పూర్, ఢిల్లీ, పట్నా, తిరువనంతపురంలోని 19 ఆర్బీఐ కార్యాలయాల్లో నోట్ల మార్పిడి, డిపాజిట్ ప్రక్రియ కొనసాగింది.

Updated Date - 2023-11-02T18:12:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising