ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral: ఉద్యోగానికి దరఖాస్తు చేస్తే రిజెక్ట్ చేసిందో కంపెనీ.. రిప్లై లెటర్‌‌తోపాటు వచ్చిన గిఫ్టును చూసి అవాక్కైన నిరుద్యోగి..!

ABN, First Publish Date - 2023-09-11T14:59:53+05:30

సాధారణంగా ఏదైనా సంస్థకు ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకు వెళ్లిన తర్వాత ఫలితం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తారు. ఆ ఉద్యోగం రాలేదని మెసేజ్ వచ్చినపుడు చాలా నిరాశకు గురవుతారు. అయితే తాజాగా ఓ సంస్థ అలా నిరాశకు గురి కాకుండా ఉండేందుకు సరికొత్త ఆలోచన చేసింది.

సాధారణంగా ఏదైనా సంస్థకు ఉద్యోగం (Job) కోసం ఇంటర్వ్యూకు (Interview) వెళ్లిన తర్వాత ఫలితం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తారు. ఆ ఉద్యోగం రాలేదని మెసేజ్ వచ్చినపుడు చాలా నిరాశకు గురవుతారు. అయితే తాజాగా ఓ సంస్థ అలా నిరాశకు గురి కాకుండా ఉండేందుకు సరికొత్త ఆలోచన చేసింది. తమ సంస్థకు ఉద్యోగం కోసం వచ్చి సెలెక్ట్ అవని ఓ అభ్యర్థికి రిజెక్షన్ లెటర్‌ (Rejection letter )తో పాటు ఓ గిఫ్ట్ కార్డు (Gift card)ను కూడా పంపించింది. ఆ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

రెడ్డిట్‌లో వైరల్ అవుతున్న ఆ పోస్ట్ ప్రకారం.. ఆ వ్యక్తి సీక్రెట్ సుషి (Secret Sushi) అనే డిజిటల్ మార్కెటింగ్ సంస్థలో ఉద్యోగం కోసం వెళ్లాడు. ఇంటర్వ్యూలో ఆ అభ్యర్థి సెలెక్ట్ అవలేదు. ఆ విషయం తెలుపుతూ ఆ అభ్యర్థికి సంస్థ ఓ లెటర్ పంపించింది. ఆ లెటర్‌తో పాటు అమేజాన్ గిఫ్ట్ కార్డును (Amazon gift card) కూడా పంపించింది. ``మీ ఉద్యోగాన్వేషణ ఫలించాలని కోరుకుంటున్నాం. మా సంస్థలో కెరీర్ ఎంచుకోవాలనుకున్నందుకు మీకు ధన్యవాదాలు. మా గురించి తెలుసుకునేందుకు సమయం వెచ్చించినందుకు కృతజ్ఞతలు. భవిష్యత్తులో మా సంస్థలో మీరు పని చేసే అవకాశం వస్తుందని ఆశిస్తున్నాం`` అని ఆ లేఖలో సంస్థ పేర్కొంది.

Viral: స్విగ్గీ క్రియేటివిటీ మామూలుగా లేదు.. జీ-20 సమ్మిట్‌పై స్విగ్గీ ఆసక్తికర ట్వీట్.. ఫిదా అవుతున్న నెటిజన్లు!

ఆ వ్యక్తి గిఫ్ట్ కార్డును సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. ``ఫ్రెండ్స్.. నాకు ఇలా మొదటిసారి జరిగింది. నాకు రిజెక్షన్ లెటర్‌తో పాటు అమేజాన్ గిఫ్ట్ కార్డు కూడా వచ్చింది`` అని ఆ వ్యక్తి పేర్కొన్నాడు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ (Viral) అయింది. రిజెక్ట్ అయిన వ్యక్తితో ఎంతో మర్యాదగా వ్యవహరించిన కంపెనీపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ``చాలా కంపెనీలు రిజెక్ట్ అయినట్టు కనీసం సమాచారం కూడా ఇవ్వవు. ఈ సంస్థ చాలా గొప్పది`` అని చాలా మంది కామెంట్లు చేశారు.

Updated Date - 2023-09-11T14:59:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising