Thai Cave Rescue: అప్పుడు బయటపడ్డాడు.. ఇప్పుడు మరణించాడు
ABN, First Publish Date - 2023-02-16T10:32:59+05:30
భారీ వరదల కారణం 2018లో 12 మంది బాలురు థాయ్ గుహ (Thai Cave) ఇరుక్కున్న విషయం తెలిసిందే.
భారీ వరదల కారణం 2018లో 12 మంది బాలురు థాయ్ గుహ (Thai Cave) ఇరుక్కున్న విషయం తెలిసిందే. వారందరినీ కష్టపడి కాపాడారు. వారందరూ వైల్డ్ బోర్స్ ఫుట్‌బాల్ క్లబ్ తరుఫున ఫుట్‌బాల్ ఆడుతుంటారు. అందులో డువాంగ్‌పెచ్ ప్రోమ్‌థెప్ (Duangpetch Promthep) ఒకరు. అతను ఆ టీమ్‌కి కెప్టెన్‌గా వ్యవహరించేవాడు.
ఆ గుహ నుంచి బయట పడిన తర్వాత డువాంగ్ చదువుతో పాటు ఫుట్‌బాల్ ఆడటానికి ఏడాది క్రితం యూకే (UK) వెళ్లాడు. ఈ తరుణంలోనే అతను మరణించాడని గత మంగళవారం (ఫిబ్రవరి 14)న మరణించాడని, విదేశాలలో చదువుకునేందుకు అతనికి స్కాలర్‌షిప్ అందించిన జికో ఫౌండేషన్ తెలిపింది. గత ఆదివారం (ఫిబ్రవరి 12)న అతను ఉండే ప్లేస్‌లో అచేతన స్థితిలో ఓ టీచర్ కంట పడ్డాడు. దాంతో ఆ టీచర్ వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అప్పటి నుంచి అతనిని చికిత్స జరుగుతూనే ఉంది. కానీ డువాంగ్ నుంచి ఎటువంటి స్పందన లేదని జికో ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. అయితే.. మృతి అనుమానాస్పదంగా అనిపించట్లేదని పోలీసులు తెలిపినట్లు అక్కడి ప్రముఖ మీడియా తెలిపింది.
ఇది కూడా చదవండి: Anushka Shetty: అరుదైన వ్యాధితో బాధపడుతున్న స్వీటీ.. మొదలుపెడితే 20 నిమిషాలపాటు నాన్‌స్టాప్‌గా..
కాగా.. ఆ గుహలో ఆ 12 మంది బాలురు దాదాపు రెండు వారాల పాటు ఇరుక్కుపోయారు. వారిని చాలా కష్టపడి ప్రభుత్వం కాపాడింది. ఈ రెస్కూ టీమ్‌లో పలు ఇతర దేశాలు కూడా సపోర్టుగా నిలిచాయి. దీనికి ఆధారంగా 13 లైవ్స్ (Thirteen Lives) అనే వెబ్‌సిరీస్ కూడా వచ్చింది.
Updated Date - 2023-02-16T10:37:08+05:30 IST