ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అది రక్తంతో నిండిపోయిన నది.. నేటికీ శాపగ్రస్తమైనదిగా పరిగణించే ఆ నదిలోని నీటిని తాగితే అలా మారిపోతారట!

ABN, First Publish Date - 2023-05-08T07:40:50+05:30

భారతదేశాన్ని నదుల(rivers) దేశమని అంటారు. ఈ నదులు జనం నుంచి పూజలను కూడా అందుకుంటాయి. అయితే వీటికి భిన్నంగా ఉన్న ఒక నది గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ నది ఈనాటిది కాదు శతాబ్దాల క్రితం నాటిది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భారతదేశాన్ని నదుల(rivers) దేశమని అంటారు. ఈ నదులు జనం నుంచి పూజలను కూడా అందుకుంటాయి. అయితే వీటికి భిన్నంగా ఉన్న ఒక నది గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ నది ఈనాటిది కాదు శతాబ్దాల క్రితం నాటిది. మహాభారతం(Mahabharat)లో దీనిని చర్మణ్యవతిగా పేర్కొన్నారు. ఒకప్పుడు ఈ ప్రాంతంలో రాజు రంతిదేవుడు(Rantidev) పెద్ద సంఖ్యలో జంతువులను బలి ఇచ్చాడని, వాటి రక్తమంతా ఈ నదిలో ప్రవహించేలా చేశాడని చెబుతారు.

అప్పటి నుంచి ఈ నది మొత్తం ఎర్రగా మారిపోయి(turned red) కలుషితమైపోయింది. దీంతో జనం ఈ నదిలోని నీటిని ఉపయోగించడం మానేశారు. అయితే ఇప్పుడు ఈ నది సమీపంలోని వారు ఈ నీటిని వినియోగిస్తుంటారు. ఈ నదిని దేశంలోని పవిత్ర నదులలో(holy rivers) చేర్చలేదు. ఒక పురాణ గాథ ప్రకారం మహాభారత కాలంలో పంచ పాండవుల భార్య ద్రౌపది(Draupadi) ఒకసారి ఈ నదిని కొన్ని కారణాలతో శపించిందని, ఆ తర్వాత ఈ నది భారతదేశంలోని పవిత్ర నదులలో తన స్థానాన్ని కోల్పోయిందని చెబుతారు.

ఫలితంగా ఈ నదిని ఎవరూ పూజించరు. ఈ నది మనదేశంలోని ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh)లోని చంబల్‌లో ఉంది. ఈ నదిని ‘చంబయ్’ నది అని, తిరుగుబాటుదారుల నది అని కూడా అంటారు. ఈ నది నీరు తాగినవారు తిరుగుబాటుదారులవుతారని అంటారు. ఒకప్పుడు ఈ ప్రాంతం దోపిడీదారులతో(robbers) నిండి ఉండేది. అయితే ప్రస్తుతం ఇక్కడ శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయి.

Updated Date - 2023-05-08T07:40:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising