chanakya niti: అలాంటివారితో స్నేహం మిమ్మల్ని కష్టాల్లోకి నెట్టివేస్తుంది!
ABN, First Publish Date - 2023-01-09T06:49:54+05:30
ఆచార్య చాణక్య ఉత్తమ సలహాదారు, విధాన రూపకర్త, ఆర్థికవేత్త. ఆయన విధానాలు ప్రపంచ ప్రసిద్ధి చెందాయి. ఆచార్య చాణక్యుడు ప్రఖ్యాత పండితునిగా పేరుగాంచాడు. నేటి కాలంలో కూడా ఆచార్య అందరికీ మార్గదర్శకునిగా నిలిచాడు.
ఆచార్య చాణక్య ఉత్తమ సలహాదారు, విధాన రూపకర్త, ఆర్థికవేత్త. ఆయన విధానాలు ప్రపంచ ప్రసిద్ధి చెందాయి. ఆచార్య చాణక్యుడు ప్రఖ్యాత పండితునిగా పేరుగాంచాడు. నేటి కాలంలో కూడా ఆచార్య అందరికీ మార్గదర్శకునిగా నిలిచాడు. ఆచార్య చాణక్యుడు స్త్రీపురుషుల జీవితాలు సక్రమంగా సాగేందుకు విలువైన విషయాలను వివరంగా తెలియజేశాడు. కొన్ని పరిస్థితుల్లో మిమ్మల్ని విడిచిపెట్టిన వ్యక్తి మీకు నిజమైన స్నేహితుడు కాలేడని ఆచార్య చెప్పారు.
అలాంటి స్నేహితుడు జీవితంలోకి ప్రవేశించడంతోనే సమస్యలు మొదలవుతాయి. పరిస్థితుల నుండి పారిపోయే వ్యక్తి మీకు ఎప్పటికీ మీకు అండగా నిలబడలేడు. అతను మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టి పారిపోతాడు. అయితే కష్టాల్లో ఆదుకున్న వాడు మాత్రమే నిజమైన మిత్రుడు. చాలామంది మీకు అనుకూల సమయం నడుస్తున్నప్పుడు మద్దతు ఇస్తారు. అయితే మీకు కష్టకాలం ఎదురైనప్పుడు అండగా నిలిచే వ్యక్తే నిజమైన స్నేహితుడని ఆచార్య చాణక్య తెలిపారు. అలాంటి స్నేహితుడి నుండి ఎప్పటికీ విడిచిపెట్టకూడదని ఆచార్య సూచించారు.
Updated Date - 2023-01-09T06:49:56+05:30 IST