ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

cheapest-jewelry: ఈ మార్కెట్‌లలో అత్యంత తక్కువ ధరలకే అద్భుత జ్యూయలరీ... రూ. 500 పట్టుకెళితే చాలు... బ్యాగు నిండిపోతుంది!

ABN, First Publish Date - 2023-03-08T07:10:32+05:30

cheapest jewelry: పెళ్లిళ్ల సీజన్ అయినా, సాధారణ రోజుల్లో అయినా మహిళలు(women) ఆభరణాలు ధరించేందుకు ముచ్చట పడుతుంటారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

cheapest jewelry: పెళ్లిళ్ల సీజన్ అయినా, సాధారణ రోజుల్లో అయినా మహిళలు(women) ఆభరణాలు ధరించేందుకు ముచ్చట పడుతుంటారు. ప్రతి డ్రెస్‌కి అనుగుణంగా మ్యాచింగ్ జ్యువెలరీ ఉండాలి. ఇందుకోసం మగువలు(women) మార్కెట్ మొత్తాన్ని చుట్టేస్తుంటారు. అయితే ఇప్పుడు మనం భారతదేశం(India)లోని కొన్ని ప్రముఖ నగల మార్కెట్‌ల గురించి తెలుసుకుందాం. ఇక్కడ ఎవరైనా సరే వారి డ్రెస్ మ్యాచింగ్ ప్రకారం అందమైన ఆభరణాలను చాలా చౌకగా కొనుగోలు చేయవచ్చు. ఆ మార్కెట్లివే..

మొదటి స్థానంలో జనపథ్(Janpath)

ఢిల్లీలో ఉన్న జనపథ్ మార్కెట్‌లో లెక్కలేనన్ని నగలు కనిపిస్తాయి. ఇక్కడ 10-20 రూపాయలు మొదలుకొని వేల రూపాయల వరకూ ఖరీదు చేసే ఆభరణాలను కొనుగోలు చేయవచ్చు. కాస్ట్యూమ్ జ్యువెలరీ(Costume Jewellery) అయినా, టెంపుల్ జ్యువెలరీ అయినా, ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ అయినా అన్నీ ఇక్కడ చాలా తక్కువ ధరలకే దొరుకుతాయి.

రెండవ స్థానంలో బెంగళూరు కమర్షియల్ స్ట్రీట్ (Bangalore Commercial Street)

బెంగళూరులోని కమర్షియల్ స్ట్రీట్ దేశంలోని అతిపెద్ద ఆర్టిఫిషియల్ నగల మార్కెట్‌లో ఒకటి. ఇక్కడ ఎవరైనా సరే నచ్చినన్ని ఆర్టిఫిషియల్ ఆభరణాలను కొనుగోలు చేయవచ్చు. ఈ ఆభరణాల మార్కెట్‌లో చౌక ధరల నగలు మొదలుకొని ఖరీదైన ఆభరణాల వరకూ అన్నింటినీ కొనుగోలు చేయవచ్చు. అయితే ఇక్కడ షాపింగ్ (Shopping) చేయాలనుకుంటే అధిక సమయం వెచ్చించాల్సి ఉంటంది. ఈ మార్కెట్ నిత్యం చాలా రద్దీగా ఉంటుంది.

మూడవ స్థానంలో బేగంబజార్(Begambazar)

బేగంబజార్ హైదరాబాద్‌లో ఉంది. ఆభరణాల విషయంలో ఈ మార్కెట్‌కి ఎంతో పేరు ఉంది. ఇక్కడ ఆర్టిఫిషియల్ ఆభరణాలతోపాటు బంగారు, వజ్రాల నగలు(Diamond jewelry) కూడా కనిపిస్తాయి.

నాలుగో స్థానంలో సరోజినీ నగర్(Sarojini Nagar)

సరోజినీ నగర్ దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో ఉంది. సరోజినీ నగర్ మార్కెట్ హోల్‌సేల్ షాపింగ్‌కు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ నగలతో పాటు పలు రకాల వస్తువులను చాలా చౌక ధరలకే కొనుగోలు చేయవచ్చు. ముఖ్యంగా మహిళలకు సంబంధించిన ఉత్పత్తులు ఈ మార్కెట్‌లో అధికంగా కనిపిస్తాయి.

ఐదవ స్థానంలో జోహ్రీ మార్కెట్(Johri Market)

జోహ్రీ బజార్ రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఉంది. ఈ మార్కెట్‌లో అత్యధిక స్థాయిలో ఆర్టిఫిషియల్ ఆభరణాలు(Artificial jewelry) కనిపిస్తాయి. ఇక్కడ అలనాటి సంప్రదాయ దుకాణాలు కూడా కనిపిస్తాయి. ఇక్కడ బంగారు, వెండి ఆభరణాలను కూడా కొనుగోలు చేయవచ్చు. ప్రత్యేకించి జోధ్‌పురి, రాజస్థానీ ఆభరణాలకు ఈ మార్కెట్ కేంద్రంగా ఉంది.

Updated Date - 2023-03-08T07:27:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising