Husband: పొద్దున్నే స్టేషన్‌కు వచ్చి ఓ భర్త చెప్పింది విని అవాక్కైన పోలీసులు.. వెంటనే అతడి ఇంటికి వెళ్లి చూస్తే..!
ABN, First Publish Date - 2023-09-20T20:12:01+05:30
భార్య చేసిన మోసాన్ని తట్టుకోలేకపోయిన భర్త దారుణంగా పగ తీర్చుకున్నాడు. వంటి గదిలో ఉపయోగించే కత్తితో భార్యను హత్య చేశాడు. అనంతరం ఆమె శరీరాన్ని గోనె సంచిలో ప్యాక్ చేశాడు. ఆ బ్యాగ్‌ను ఎక్కడ, ఎలా, ఎప్పుడు పారేయాలని రెండ్రోజుల పాటు ఆలోచించాడు.
భార్య (Wife) చేసిన మోసాన్ని తట్టుకోలేకపోయిన భర్త (Husband) దారుణంగా పగ తీర్చుకున్నాడు. వంటి గదిలో ఉపయోగించే కత్తితో భార్యను హత్య చేశాడు (Husband killed wife). అనంతరం ఆమె శరీరాన్ని గోనె సంచిలో ప్యాక్ చేశాడు. ఆ బ్యాగ్‌ను ఎక్కడ, ఎలా, ఎప్పుడు పారేయాలని రెండ్రోజుల పాటు ఆలోచించాడు. దొరికిపోతానని భావించి అతడే నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టమ్‌కు తరలించారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటన తమిళనాడు (TamilNadu)లో జరిగింది (Crime News).
చెన్నై (Chennai)కు చెందిన జాన్సన్ అనే 27 ఏళ్ల యువకుడు ఆవడి కార్పొరేషన్‌లో కార్మికుడిగా పని చేస్తున్నాడు. కొద్ది నెలల క్రితం సారమ్మల్ అనే మహిళను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. సారమ్మల్ దినసరి కూలీగా పని చేస్తోంది. అయితే సారమ్మల్‌కు గతంలోనే ఆమోస్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. విభేదాలు తలెత్తడంతో భార్యాభర్తలు విడిపోయారు. సారమ్మల్ తన ఇద్దరు పిల్లలను తల్లిదండ్రుల వద్ద వదిలేసి ఆవడికి పని కోసం వెళ్లింది. అక్కడ జాన్సన్ ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది. జాన్సన్ దగ్గర తన మొదటి వివాహం విషయం దాచింది.
Marriage: పెళ్లయిన మూడు నిమిషాలకే విడాకులు.. వివాహాన్ని రద్దు చేయండంటూ కోర్టు మెట్లెక్కిన భార్యాభర్తలు.. చివరకు..!
ఇటీవల సారమ్మల్ మొదటి వివాహం గురించి జాన్సన్‌కు తెలిసింది. దీంతో ఇద్దరూ గొడవ పడ్డారు. జాన్సన్ ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. వేరే ఇల్లు తీసుకుని అక్కడ ఉంటున్నాడు. వారం రోజుల క్రితం జాన్సన్‌కు నచ్చ చెప్పేందుకు సారమ్మల్ అతడి ఇంటికి వెళ్లింది. అక్కడ ఇద్దరి మధ్య గొడవ జరిగింది. తీవ్ర ఆగ్రహానికి గురైన జాన్సన్ వంటింట్లోని కత్తితో సారమ్మల్‌ను హత్య చేశాడు. అనంతరం ఆమె శరీరాన్ని గోనె సంచిలో ప్యాక్ చేశాడు. అయితే ఆ సంచి ఎలా పారెయ్యాలో తెలియక నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు.
Updated Date - 2023-09-20T20:12:01+05:30 IST