ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chandrayaan-3: లక్ అంటే ఇదీ..విమానం కిటికీలోంచి చూస్తే కనిపించిన చంద్రయాన్-3.. ప్రయాణికులకు గూస్‌బంప్స్!

ABN, First Publish Date - 2023-07-16T18:11:43+05:30

ఇటీవల చెన్నై నుంచి ఢాకా వెళుతున్న విమానంలోని ప్రయాణికులకు అద్భుత అవకాశం దక్కింది. చంద్రుడివైపు దూసుకుపోతున్న చంద్రయాన్-3ని వారు విమానం కిటీకీల్లోంచి చూసి పులకించిపోయారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నె్ డెస్క్: ప్రస్తుతం ఏ ఇద్దరు భారతీయులు కలిసినా అక్కడ చంద్రయాన్ గురించే చర్చ! చంద్రుడి రహస్యాలు ఛేదించేందుకు నిప్పులు చిమ్ముతూ చంద్రయాన్-3(Chandrayaan-3) నింగిలోకి ఎగసిన క్షణాన ప్రతి భారతీయుడి హృదయం సంతోషంతో నిండిపోయింది. అనేక మంది ఇప్పటికే ఈ దృశ్యాల్ని డీపీలుగా, వాట్సాప్ స్టేటస్‌లుగా పెట్టుకుని తమ సంబరాన్ని తెలియజేశారు. అయితే, చంద్రయాన్-3 నింగిలోకి ఎగసిన సమయంలోనే ఓ విమానంలో వెళుతున్న ప్రయాణికులకు మరో అద్భుతమైన దృశ్యం కనిపించింది. విమానం కిటికీల్లోంచి తొంగి చూసిన వారికి పక్క నుంచి చంద్రయాన్-3 వెళుతూ కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా(Viral Video) మారింది.

ఇవీ చదవండి: ఈ రైతు చేసిన పొరపాటును మీరెవ్వరూ చేయకండి.. సోషల్ మీడియాలో ప్రభుత్వ ఉన్నతాధికారి విజ్ఞప్తి..

చెన్నై నుంచి ఢాకా వెళుతున్న విమానంలోని ప్రయాణికులకు(Chennai-Dhaka flight passengers) ఈ అధ్భుత అవకాశం దక్కింది. ఆ విమానంలోని ప్రయాణికులకు పైలట్ ముందుగానే చంద్రయాన్-3 గురించి చెప్పారు. తాము వెళ్లే దారిలో చంద్రయాన్-3 కనిపిస్తుందని అన్నారు. గాల్లో దూసుకుపోతున్న చంద్రయాన్-3 కనిపించగానే ఆయన ప్రయాణికులను ఎలర్ట్ చేశారు. వారంతా విమానం కిటికీల్లోంచి చంద్రయాన్ చూస్తూ పులకించిపోయారు(flight passengers witness chandrayaan-3). కొందరు ఈ అరుదైన దృశ్యాన్ని వీడియోలో రికార్డు చేసి నెట్టింట్లో పెట్టడంతో వైరల్‌గా మారింది. ఇస్రోకు చెందిన డా.పీ.వీ వెంకటకృష్ణన్ ఈ వీడియోను షేర్ చేశారు.

ఇవీ చదవండి: ఇది మామూలు కోడి కాదు! పదుల సంఖ్యలో మొసళ్లు ఒక్కసారిగా ఎటాక్ చేస్తే..

ఈ దృశ్యాలు నెటిజన్లకు ఎంతగా నచ్చాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతరిక్షంలోకి దూసుకుపోతున్న చంద్రయాన్-3ని ఇలా చూసే అవకాశం దక్కడం నిజంగా అదృష్టమని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. వీడియో గూస్‌బంప్స్ తెప్పిస్తోందని అనేక మంది కామెంట్ చేశారు. నెట్టింట వైరల్‌గా మారిన ఈ వీడియోను మీరూ చూడండి!

ఇవీ చదవండి: నెమలితో పెట్టుకుంటే ఇంతే.. అది తనను చూడట్లేదు కదా అని ఈ యువతి చేసిన పని ఎంటో తెలిస్తే..

Updated Date - 2023-07-16T18:13:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising