ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చూయింగ్ గమ్- బబుల్ గమ్ మధ్య తేడాలివే... బబుల్ గమ్ తయారీ వెనుక ఎంత కథ ఉందంటే...

ABN, First Publish Date - 2023-04-10T12:38:21+05:30

చూయింగ్ గమ్- బబుల్ గమ్ రెండూ భిన్నమైనవి. రెండింటి మధ్య స్వల్ప వ్యత్యాసం ఉంది. బబుల్ గమ్(Bubble gum) నములుతూ దానిని సాగదీయవచ్చు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

చూయింగ్ గమ్- బబుల్ గమ్ రెండూ భిన్నమైనవి. రెండింటి మధ్య స్వల్ప వ్యత్యాసం ఉంది. బబుల్ గమ్(Bubble gum) నములుతూ దానిని సాగదీయవచ్చు. కానీ చూయింగ్ గమ్‌(Chewing gum)ను సాగదీయడం సాధ్యం కాదు. బబుల్ గమ్ తయారు చేయాలనే ఆలోచన ఫిలడెల్ఫియా(Philadelphia)లోని ఫ్లెయిర్ కార్పొరేషన్ వ్యవస్థాపకుడు ఫ్రాంక్ హెచ్. ఫ్లెయిర్‌కు వచ్చింది. మొదటి బబుల్ గమ్ 1906 సంవత్సరంలో తయారు చేశారు. అతను తన ఆవిష్కరణను బ్లిబ్బర్-బ్లబ్బర్(Blibber-Blubber) అని పిలిచాడు. జనం ఇష్టపడే ఉత్పత్తిని ప్రపంచానికి అందించాలని ఫ్లెయిర్ కోరుకున్నాడు.

అయితే ఫ్లెయిర్ తన మొదటి ప్రయత్నంలో విఫలమయ్యాడు. తొలిసారిగా విజయవంతమైన బబుల్ గమ్(Bubble gum) 1928 సంవత్సరంలో తయారయ్యింది. BBC హిస్టరీలో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం, ఫ్లెయిర్ దగ్గర పనిచేసే అకౌంటెంట్ వాల్టర్ డైమర్ ల్యాబ్‌లో బ్లబ్బర్-బ్లబ్బర్‌తో ప్రయోగాలు చేస్తున్నాడు. అప్పుడు వారు అనుకోకుండా నమలగలిగే, సులభంగా సాగదీయగలిగే(stretchable) పదార్థాన్ని సృష్టించారు. ఈ ప్రత్యేకమైన ఉత్పత్తికి డబుల్ బబుల్ అని పేరు పెట్టారు. ఫ్లెయిర్ దాని మొదటి బ్యాచ్‌ను 1928లో స్థానిక దుకాణానికి పంపాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఒక్క రోజులో బ్యాచ్ మొత్తం అమ్ముడు పోయింది.

డైమర్ తయారు చేసిన బబుల్ గమ్ లేత బూడిద రంగులో ఉంది. ఇది చూడడానికి బాగాలేదు. అయితే ఆ సమయంలో ఫ్యాక్టరీ(Factory)లో రెడ్ కలర్ డై మాత్రమే అందుబాటులో ఉంది. గ్రే బబుల్ గమ్‌లో రెడ్ కలర్ డై కలపడంతో పింక్‌గా మారింది. అప్పటి నుండి బబుల్ గమ్ గులాబీ రంగు(pink color)ను సంతరించుకుంది.

Updated Date - 2023-04-10T13:12:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising