ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Strange Laws in China: చైనాలో అయిదు వింత చట్టాలు.. స్త్రీలు యాడ్స్‌లో నటించడాన్ని బ్యాన్ చేయడం మాత్రమే కాదండోయ్.. ఈ రూల్స్ కూడా..

ABN, First Publish Date - 2023-03-07T19:01:27+05:30

ప్రపంచంలోని అత్యధిక జనాభా కలిగిన దేశం చైనా. అధ్యక్ష తరహా పాలన సాగే చైనాలో నియంతృత్వ పోకడలు రాజ్యమేలుతుంటాయి. ప్రభుత్వం కఠిన చట్టాలను అమలు చేస్తుంటుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ప్రపంచంలోని అత్యధిక జనాభా కలిగిన దేశం చైనా (China). అధ్యక్ష తరహా పాలన సాగే చైనాలో నియంతృత్వ పోకడలు రాజ్యమేలుతుంటాయి. ప్రభుత్వం కఠిన చట్టాలను అమలు చేస్తుంటుంది. అశ్లీలత పెరుగుతోందనే ఉద్దేశంతో ఇటీవల చైనా ప్రభుత్వం లో దుస్తుల ప్రకటనల్లో అమ్మాయిలు నటించడాన్ని నిషేధించిన సంగతి తెలిసిందే (China has banned female models). దీంతో అబ్బాయిలే అమ్మాయిల లో దుస్తులు ధరించి యాడ్స్ చేస్తున్నారు. చైనా ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త నిబంధన వల్ల చాలా మంది మోడల్స్ ఆదాయం కోల్పోయారు. అయినా ప్రభుత్వానికి అలాంటివేం పట్టవు. ఇది మాత్రమే కాదు చైనాలో చాలా వింత చట్టాలు అమల్లో ఉంటాయి. అవేంటో ఓ సారి చూద్దాం.

చైనాలో వింత చట్టాలు (Strange Laws in China)

* ప్రపంచంలోని ఎన్నో దేశాలు వినియోగిస్తున్న గూగుల్ (Google), ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్, యూట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాలకు చైనాలో స్థానం లేదు. చైనీయులు తమ స్వంత దేశానికి చెందిన సెర్చ్ ఇంజన్లను మాత్రమే వాడాలి. అక్కడ లభించే ఇంటర్నెట్‌లో ప్రతీది ఫిల్టర్ అవుతుంది. ప్రజలు ఏమి చూడాలో, ఏది చూడకూడదో అక్కడి ప్రభుత్వం నిర్ణయిస్తుంది.

* చైనాలో పోర్నోగ్రఫీ వంటి అడల్ట్ కంటెంట్ (Adult Content) నిషేధం. ఎవరైనా వ్యక్తి అడల్ట్ కంటెంట్‌ను కలిగి ఉంటే మూడేళ్ల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది.

*చైనీస్ ప్రభుత్వం జాస్మిన్ (మల్లెపూవు) అనే పదాన్ని నిషేధించింది. బీజింగ్‌తో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లోని మార్కెట్‌లు, దుకాణాలలో మల్లె పువ్వును విక్రయించడాన్ని నిషేధించింది. ట్యునీషియా జాస్మిన్ విప్లవం తర్వాత చైనా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది (Tunisia Jasmine Revolution).

*వివాహేతర సంబంధాలను (Extra Marital Affairs) తీవ్ర నేరాలుగా పరిగణిస్తారు. కావాలని వేరే వ్యక్తి భార్యతో శృంగారం చేయడం నిషేధం. అనుకోని పరిస్థితుల్లో శృంగారం మాత్రం నేరం కాదట.

*పిల్లలకు వింత పేర్లు పెట్టడం కూడా చైనాలో కుదరదు. మాండరిన్ భాషలోనే పిల్లలకు పేర్లు పెట్టాలి. అలాగే చైనాలో పిల్లలు, పెద్దలు వీడియో గేమ్‌లు ఆడడానికి వీల్లేదు.

Viral Photo: అమ్మాయిలూ సారీ.. అంటూ ఆటో వెనుక వింత కొటేషన్.. ఫన్నీ కామెంట్స్‌తో సెటైర్లు పేల్చుతున్న నెటిజన్లు..

Updated Date - 2023-03-07T19:01:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising