Viral Video: చైనాలో ఇలాంటి చట్టాలు కూడా ఉంటాయా..? నెటిజన్ల ఆగ్రహం.. ఓ బాలిక మోకాళ్లపై కూర్చుని మరీ వేడుకున్నా కనికరం లేకుండా..
ABN, First Publish Date - 2023-03-18T21:15:52+05:30
చైనాలో ఓ బాలికకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చైనాలోని ఆ నిబంధన గురించి జోరుగా చర్చ జరుగుతోంది.
చైనాలో (China) ఓ బాలికకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా (Viral Video) మారింది. చైనాలోని ఆ నిబంధన గురించి జోరుగా చర్చ జరుగుతోంది. ఆ వీడియోలోని ఓ బాలిక ఓ మహిళ ముందు మోకాళ్ల మీద కూర్చుని, డబ్బులు ఇవ్వండని వేడుకుంటోంది. ఆ బాలిక అడుగుతోంది ఆ మహిళ డబ్బు కాదు.. తన డబ్బే. పేద కుటుంబానికి చెందిన బాలిక ప్రభుత్వం ఇచ్చే స్కాలర్ షిప్‌తో చదువుకుంటోంది. అందులో సుమారు 200 యువాన్లు (దాదాపు రూ.2000 వేలు) రోడ్డు మీద పారేసుకుంది (Chinese girl Viral Video).
ఆ డబ్బు (Money) అటుగా వెళ్తున్న ఓ మహిళకు దొరికింది. వెంటనే చూసుకున్న బాలిక.. ఆ మహిళ డబ్బు తీయడం చూసింది. ఆ డబ్బు తనదని, వెనక్కి ఇవ్వాలని ఆ మహిళను బాలిక కోరింది. అందుకు ఆ మహిళ నిరాకరించింది. నిబంధనల ప్రకారం ఎవరికి డబ్బు దొరికితే అది వారిదేనని ఆ మహిళ చెప్పింది. డబ్బు ఇచ్చేది లేదని మహిళ తేల్చి చెప్పింది. ఆ డబ్బు తనకు ఎంతో అవసరం కావడంతో ఆ బాలిక రోడ్డు పైనే ఆ మహిళ ఎదుట మోకాళ్ల మీద కూర్చుని కన్నీళ్లతో వేడుకుంది. అయినా ఆ మహిళ మనసు కరగలేదు.
Viral Video: వామ్మో.. ఇదేం వింత టెక్నిక్.. లోపలికి దిగకుండానే మురికి పట్టి ఉన్న నీళ్ల డ్రమ్మును ఎలా క్లీన్ చేశాడో మీరే చూడండి..!
రోడ్డు మీద వెళ్తున్న ఓ వ్యక్తి ఆ ఘటన మొత్తాన్ని వీడియో తీశాడు. ఆ బాలిక డబ్బులు ఆమెకు ఇచ్చెయ్యాలని రిక్వెస్ట్ చేశాడు. చట్టం పక్కన పెట్టి, మానవత్వంతో వ్యవహరించాలని కోరాడు. రోడ్డు మీద చాలా మంది వ్యక్తులు వచ్చి చేరడంతో ఆ మహిళ తన మనసు మార్చుకుంది. ఆ బాలికకు తిరిగి డబ్బులు ఇచ్చేసింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ మహిళపై, చైనాలోని అలాంటి నిబంధనపై సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Updated Date - 2023-03-18T21:15:52+05:30 IST