ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Lokesh Kanagaraj: విలన్‌గా విక్రమ్.. అతిథి పాత్రలో కమల్ హాసన్

ABN, First Publish Date - 2023-01-25T15:23:16+05:30

‘ఖైదీ’ (Kaithi) సినిమాకు దర్శకత్వం వహించి అన్ని ఇండస్ట్రీలను తన వైపునకు తిప్పుకొన్న దర్శకుడు లోకేష్ కనకరాజ్ (Lokesh Kanagaraj). చివరగా ‘విక్రమ్’ (Vikram) ను తెరకెక్కించాడు. కమల్ హాసన్ హీరోగా నటించిన ఈ మూవీ కోలీవుడ్ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘ఖైదీ’ (Kaithi) సినిమాకు దర్శకత్వం వహించి అన్ని ఇండస్ట్రీలను తన వైపునకు తిప్పుకొన్న దర్శకుడు లోకేష్ కనకరాజ్ (Lokesh Kanagaraj). చివరగా ‘విక్రమ్’ (Vikram) ను తెరకెక్కించాడు. కమల్ హాసన్ హీరోగా నటించిన ఈ మూవీ కోలీవుడ్ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. లోకేష్ ప్రస్తుతం ఇళయ దలపతి విజయ్‌ (Vijay) తో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ ప్రాజెక్టు వర్కింగ్ టైటిల్‌గా ‘దళపతి 67’ (Thalapathy 67) అని వ్యవహరిస్తున్నారు. ఈ మూవీ సినిమాటిక్ యూనివర్స్ నేపథ్యంలో తెరకెక్కుతుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్‌డేట్ కోలీవుడ్ మీడియాలో షికార్లు కొడుతుంది.

‘దళపతి 67’ లో చియాన్ విక్రమ్ (Vikram), కమల్ హాసన్ (Kamal Haasan) నటించనున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో చియాన్ విక్రమ్ మెయిన్ విలన్‌గా కనిపించనున్నాడని సమాచారం అందుతుంది. కమల్ హాసన్ తన ‘విక్రమ్’ పాత్రనే పోషించనున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. ‘ఖైదీ’, ‘విక్రమ్’ సినిమాలకు సంబంధించిన లింక్స్ కూడా ఈ ప్రాజెక్టులో ఉంటాయట. లోకేష్ గత చిత్రం ‘విక్రమ్’ క్లైమాక్స్‌‌లో సూర్య విలన్‌గా అతిథి పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. రోలెక్స్ పాత్రలో కనిపించి సూర్య ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడు. ఇక ‘దళపతి 67’ విషయానికి వస్తే.. ఈ సినిమా భారీ బడ్జెట్‌తో రూపొందుతుంది. త్రిష హీరోయిన్‌గా నటిస్తుంది. సంజయ్ దత్, మిస్కిన్, గౌతమ్ మీనన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Updated Date - 2023-01-25T15:23:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising