ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

K.Viswanath Demise: సినీ ప్రముఖుల సంతాపం.. ఎవరేమన్నారంటే..

ABN, First Publish Date - 2023-02-03T09:44:22+05:30

కళాతపస్వీ కె.విశ్వనాథ్ (K.Viswanath) మరణంతో టాలీవుడ్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కళాతపస్వీ కె.విశ్వనాథ్ (K.Viswanath) మరణంతో టాలీవుడ్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మరణ వార్త తెలిసిన ఎంతోమంది ప్రముఖులు ఆయన మరణానికి సంతాపం తెలియజేస్తున్నారు. సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవ ఎప్పటికీ మరచిపోలేమని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబానికి సానుభూతిని తెలియజేస్తున్నారు...

కళాతపస్వీ స్వర్గస్తులైనందుకు మనస్ఫూర్తిగా వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. నాకు సినిమాలంటే తెలియని సమయంలో.. పాశ్చాత్య పాటలను ఇష్టపడే నాకు మన శాస్త్రీయ సంగీత పెరిగేలా చేశారు. యాక్షన్ సినిమాలంటే ఇష్టపడే నా దృక్పథాన్ని శంకరాభరణం మార్చేసింది

- పవన్ కల్యాణ్

‘విశ్వనాథ్ గారు ప్రతి సినిమా చివరిలో కళా కొనసాగుతూనే ఉంటుందంటారు. అలాగే ఆయన మరణం కూడా ముగింపు కాదు. ఆయన తాలుకు కళా వారసత్వానికి కొనసాగింపని అనుకుంటున్నాను. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలి. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి’

- త్రివిక్రమ్ శ్రీనివాస్

‘బాక్సాఫీస్ కంటే సినిమా ఎక్కువ.

తారలకంటే సినిమా ఎక్కువ.

వ్యక్తుల కంటే సినిమా ఎక్కువ.

ఇది నేర్పింది ఎవరో తెలుసా?

గ్రెటేస్ట్ కె. విశ్వనాథ్ గారు.

మీ రుణం.. వీడుకోలు’

- నాని

‘లెజెండరీ దర్శకుడు కె.విశ్వనాథ్‌ మృతి నన్ను తీవ్రంగా కలిచి వేసింది. సినిమాపై ఆయనకున్న ప్యాషన్‌, కథను చెప్పే విధానం, పని పట్ల నిబద్ధత నాలాంటి ఎంతోమంది సినీ దర్శకులకు స్ఫూర్తి’.

- క్రిష్

‘జీవిత పరమార్థాన్ని, కళ సజీవమైనదని పూర్తి అర్థం చేసుకున్న గొప్ప వ్యక్తి కళాతపస్వి కె.విశ్వనాథ్‌గారు. ఆయన చేసిన కళాసేవ ఎప్పటికీ అజరామరం. ఆయన తదనంతరం కూడా అది బతికే ఉంటుంది’

- కమల్ హాసన్

Updated Date - 2023-02-03T09:53:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising