ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Coconut For Weight Loss: కొబ్బరికాయలతో బరువు ఎలా తగ్గుతారని అనుమానమా..? ఈ 6 కారణాలను వింటే..!

ABN, First Publish Date - 2023-09-05T17:25:55+05:30

ఈ 6 విషయాలు తెలుసుకుంటే చాలు. బరువు తగ్గడంకోసం కొబ్బరినీరు తీసుకోవచ్చా లేదా అనే క్లారిటీ వచ్చేస్తుంది.

అధిక బరువు అన్నిరకాలుగా అనర్థం అనే మాట వినే ఉంటారు. మధుమేహం, అధిక కొలెస్ట్రాల్, గుండె జబ్బులు, కీళ్ల నొప్పులు, ఎముకల బలహీనత వంటి సమస్యలన్నీ అధిక బరువు కారణంగానే వస్తున్నాయి. మరీ ముఖ్యంగా శరీర సౌష్టవం చాలా దారుణంగా దెబ్బతింటుంది. ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే మొదట బరువు తగ్గడం ఎంతో ముఖ్యం. బరువు తగ్గడం కోసం బరువు తగ్గించే ఆహారాలు, పానీయాలు తీసుకోవడం వల్ల తొందరగా ఫలితం కనిపిస్తుంది. చాలామంది బరువు తగ్గడానికి కొబ్బరినీరు తాగుతుంటారు. మరికొందరు అదంతా ఒట్టి అపోహ కొబ్బరి నీరు తాగడం వల్ల బరువు తగ్గరు అని కూడా చెబుతుంటారు. అయితే ఈ కింది 6కారణాలు తెలిస్తే బరువు తగ్గడంలో కొబ్బరి నీళ్ల పాత్ర ఏంటో అర్థమవుతుంది.

బరువు తగ్గడానికి వైద్యులు చెప్పే మాట తక్కువ కేలరీలు(low calories) కలిగిన ఆహారాలు తీసుకొమ్మని. కొబ్బరినీళ్ళలో కేలరీలు తక్కువ ఉంటాయి. దీని కారణంగా ఈ నీటిని తీసుకున్నప్పుడు బరువు పెరిగే అవకాశం లేదు. పైపెచ్చు ఈ నీరు కడుపు నింపిన భావన కలిగిస్తుంది. ఈ కారణంగా ఆకలిని నియంత్రిస్తుంది.

కొబ్బరినీళ్లలో పోషకాలు, ఖనిజాలు మెండుగా ఉంటాయి. ఇవి మాత్రమే కాకుండా ఇందులో ఎంజైమ్ లు , ఎలక్ట్రోలైట్ లు ఉంటాయి. ఈ కారణంగా ఇది శరీరంలో పోషకాలను సమతుల్యంగా(protein balance) ఉంచుకోవడంలో సహాయపడుతుంది.

కొబ్బరికాయనీరు తాగగానే అందులో ఉన్న లేత కొబ్బరి తినడం చాలామందికి ఇష్టం. ఈ కొబ్బరిలో పైబర్(fiber) చాలా మంచిది. ఇది కరిగే ఫైబర్. ఈ కారణంగా ఇది బరువు తగ్గడాన్ని ప్రోత్సహిస్తుంది. జీర్ణక్రియకు కూడా గొప్పగా సహాయపడుతుంది. ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉంచుతుంది.

Viral: సైబర్ క్రైమ్ ముఠాకే చుక్కలు చూపించాడుగా.. పార్ట్‌టైమ్ జాబ్ కావాలా..? అని వాట్సప్‌లో ఆ కుర్రాడికి మెసేజ్ వస్తే..



పచ్చికొబ్బరిలో మీడియం చైన్ ట్రైగ్లిజరైనడ్ కొవ్వు ఉంటుంది. ఇది అధిక ఆహారం తీసుకోవాలనే కోరికను నియంత్రిస్తుంది. చాలామంది బరువు పెరగడానికి కారణం ఎప్పుడూ ఏదో ఒకటి తినాలని అనిపించడం. ఈ కోరికల్ని కొబ్బరికాయలో ఉండే లేత కొబ్బరి తగ్గిస్తుంది.

జీర్ణక్రియ సరిగ్గా ఉంటే తిన్న ఆహారం బాగా జీర్ణమైపోతుంటే బరువు సమస్య చాలావరకు నియంత్రణలో ఉంటుంది. కానీ జీర్ణవ్యవస్థ సరిగా లేకపోతే బరువు పెరగడం వేగమవుతుంది. కొబ్బరికాయలోని ఎంజైమ్ లు, పొటాషియం జీర్ణక్రియను పెంచడంలో సహాయపడతాయి. ఇవి మాత్రమే కాకుండా ఇందులో అదనపు పోషకాలు, ఖనిజాలు కూడా మంచి జీర్ణక్రియకు సహకరిస్తాయి. జీవక్రియ బాగుంటే అధిక కేలరీలు బర్న్ చేయడం సులువు. కొబ్బరికాయనీరు తీసుకోవజం, కొబ్బరి తినడం వల్ల ఇది సాధ్యమవుతుంది.

కొబ్బరినీళ్లలో ఉండే ఎంజైమ్ లు బరువు తగ్గడానికి చక్కగా పనిచేస్తాయి. జీవక్రియను వేగవంతం చేసి పొట్టభాగంలో కొవ్వులు కరిగించడంలో ఇవి సహాయపడతాయి. ఈ కారణంగా ప్రతిరోజు కొబ్బరినీళ్లు తీసుకునేవారు కేలరీలు బర్న్ చేయడంలోనూ, తద్వారా బరువు తగ్గించడంలోనూ సహాయపడతాయి.

Accident Video: కుక్కను కాపాడాలని బ్రేక్ వేసింది కానీ.. మరుక్షణంలోనే షాకింగ్ సీన్.. కారుపై ఏదో పడ్డట్టు అనిపించి బయటకు వచ్చి చూస్తే..!


Updated Date - 2023-09-05T17:25:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising