Viral Video: తల్లి వయసున్న ఆంటీకి `ఐ లవ్యూ` చెప్పిన కుర్రాడు.. ఆమె రియాక్షన్ ఏంటంటే..
ABN, First Publish Date - 2023-02-10T19:16:16+05:30
ప్రేమకు వయస్సు, కులం, జాతి, మతంతో సంబంధం లేదంటారు. మిగతా వాటి సంగతి పక్కన పెడితే వయసు గురించి కొంత ఆలోచించాల్సిందే. తాజాగా ఓ కాలేజీ కుర్రాడు వయసు తారతమ్యం మరిచి తన తల్లి వయసున్న మహిళకు నడిరోడ్డుపై ప్రపోజ్ చేశాడు.
ప్రేమకు వయస్సు, కులం, జాతి, మతంతో సంబంధం లేదంటారు. మిగతా వాటి సంగతి పక్కన పెడితే వయసు గురించి కొంత ఆలోచించాల్సిందే. తాజాగా ఓ కాలేజీ కుర్రాడు వయసు తారతమ్యం మరిచి తన తల్లి వయసున్న మహిళకు నడిరోడ్డుపై ప్రపోజ్ చేశాడు (College boy proposes to woman double his age). దీంతో ఆ మహిళ ఆ కుర్రాడికి తగిన రీతిలో బుద్ధి చెప్పంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అవుతోంది.
వైరల్ అవుతున్న ఆ వీడియోలో జనం గుమిగూడి ఉన్నారు. రోడ్డుపై నిల్చున్న మహిళ.. ఆ కుర్రాడు చాలా అసభ్యంగా మాట్లాడుతున్నాడు. అతడేం మాట్లాడాడో చెప్పడానికి కూడా నాకు సిగ్గుగా ఉంది. అతడి వయసెంత, నా వయసెంత? ఆ కుర్రాడికి నా కొడుకు వయసుంటుంది. నన్ను ప్రేమిస్తున్నాడట
అని ఆగ్రహంగా చెబుతోంది. దీంతో ఆ బాలుడు ఆమెను ఆంటీ
(Aunty) అని సంబోధించాడు. ఇప్పుడు నేను ఆంటీనని గుర్తొచ్చిందా అంటూ ఆ మహిళ ఆ కుర్రాడిని చెప్పుతో కొట్టింది. మరో వ్యక్తి కూడా ఆ కుర్రాడిని కొట్టాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Updated Date - 2023-02-10T19:16:17+05:30 IST