ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Corn Silk: మొక్కజొన్న తినే అందరూ చేస్తున్న మిస్టేక్ ఇదే.. పనికిరాదని చెత్తబుట్టలోకి వేస్తుంటారు కానీ..

ABN, First Publish Date - 2023-06-18T14:24:31+05:30

మొక్కజొన్న కంకులలో పొటాషియం, కాల్షియం, విటమిన్ సి, బి2, విటమిన్ కె సమృద్దిగా ఉంటాయి. పైగా ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. మొక్కజొన్న పొత్తు వొలవగానే ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మొక్కజొన్నలు(corn) పిల్లలకు, పెద్దలకు కూడా బాగా ఇష్టమైనవి. వీటిని ఉడికించుకుని, కాల్చుకుని, గారెలు, చాట్ ఇలా చాలా విధాలుగా స్నాక్ లో భాగంలో చేసుకుంటారు. మొక్కజొన్న కంకులలో పొటాషియం, కాల్షియం, విటమిన్ సి, బి2, విటమిన్ కె సమృద్దిగా ఉంటాయి. పైగా ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. మొక్కజొన్న పొత్తు వొలవగానే పొట్టుతో సహా కంకి మీద కనిపించే పట్టు దారాల్లాంటి నారను పారేస్తుంటాం. కానీ ఈ నార వల్ల ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయి. సుమారు 5వేల ఏళ్ళ క్రితమే మొక్కజొన్న నారను ఆరోగ్యం కోసం ఉపయోగించారనే వాస్తవం చాలా షాకింగ్ గా అనిపిస్తుంది. ఇంతకూ మొక్కజొన్న నార వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుంటే..

మొక్కజొన్న నార(corn silk) కిడ్నీలో రాళ్ళు(kidney stones)తొలగించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. కిడ్నీల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ప్రమాదకరమైన క్రియాటినిన్ ను తగ్గించడంలో సహాయపడుతుంది. మొక్కజొన్న పొత్తు మీది నారను నీటిలో వేసి మరిగించి టీ(corn silk tea) లా తయారుచేసుకుని తాగాలి. దీన్ని తాగడం వల్ల మూత్రపిండాలలో పేరుకున్న టాక్సిన్లు, నైట్రేట్ లు కిడ్నీలో రాళ్లు తొలగిపోతాయి.

Viral video: ఓ మహిళ చేతిలో బిడ్డను చూడగానే గొరిల్లాల ఊహించని రియాక్షన్.. పరిగెత్తి వెళ్లి మరీ అవి చేసిన పనేంటో మీరే చూడండి..


మూత్రంలో మంట(urine bunt), మూత్రం ఎర్రగా ఉండటం, యూరినరీ ట్రాక్ ఇన్షెక్షన్(urinary track infection) కారణంగా ఏర్పడతాయి. ఈ సమస్యను మొక్కజొన్న నారతో చేసిన టీ తాగడం వల్ల పరిష్కరించవచ్చు. ఎప్పుడైనా గాయం తగిలి రక్తం ధారగా కారిపోతుంటే మొక్కజొన్న నార మరిగించిన నీళ్ళను బాదితులకు తాగించడం ద్వారా రక్తస్రావం తగ్గించవచ్చు. ఇందులో ఉండే విటమిన్-కె రక్తస్రావం ఆపడంలో సహాయపడుతుంది. అంతేకాదు పురుషులలో ప్రొస్టేస్ గ్రంధి(prostate gland) పనితీరు సక్రమంగా ఉండేలా చేస్తుంది. డయాబెటిస్(diabetes) ఉన్నవారికి అద్భుత వరం. ఈ నారతో టీ చేసుకుని తాగితే రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది. ఇన్సులిన్ గుణాలు ఈ టీ లో ఉంటాయి. జీవక్రియను మెరుగుపరుస్తుంది. అధికబరువు తగ్గాలని అనుకునేవారికి కూడా ఈ టీ బాగా పనిచేస్తుంది.

Updated Date - 2023-06-18T14:24:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising