Honeymoon Video: హనీమూన్‌కు వెళ్లి రాత్రంతా ఇదేం నిర్వాకం..? కొత్త జంట షేర్ చేసిన వీడియోపై సెటైర్లు పేల్చుతున్న నెటిజన్లు..!
ABN, First Publish Date - 2023-03-29T18:33:13+05:30
పెళ్లి తర్వాత నూతన దంపతులు కలిసి చేసే మొదటి ప్రయాణం హనీమూన్. తమ జీవితంలో హనీమూన్ అనేది ఎప్పటికీ ప్రత్యేకంగా, మధురంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు.
పెళ్లి (Marriage) తర్వాత నూతన దంపతులు (Newly Wed) కలిసి చేసే మొదటి ప్రయాణం హనీమూన్ (Honeymoon). తమ జీవితంలో హనీమూన్ అనేది ఎప్పటికీ ప్రత్యేకంగా, మధురంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అలాగే హనీమూన్ విషయాలు కాస్త రహస్యంగా ఉండాలని కూడా కోరుకుంటారు. అయితే నేటి యువతీ యువకులు మాత్రం తమ హనీమూన్ విషయాలను కూడా సోషల్ మీడియా ద్వారా అందరితో పంచుకుంటున్నారు. ఇంటర్నెట్‌లో వైరల్ కావడానికి రకరకాల ట్రిక్‌లను అవలంబిస్తున్నారు. (Honeymoon Video)
తాజాగా వివాహం చేసుకున్న ఓ జంట తమ హనీమూన్ వీడియోను సొషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ (Trending Video) అవుతోంది. ఆ వీడియో చూస్తే నవ్వకుండా ఉండలేరు. పెళ్లి కార్యక్రమాలతో బాగా అలసి పోయిన వధువు తొలి రాత్రి (First Night) తమ గదిలోకి వెళ్లగానే ఫోన్‌ను బయటకు తీసింది. వరుడు ఆమె చున్నీతో ఆడుకున్నాడు. ఆ తర్వాత వధువు తల నుంచి పిన్నులు, నగలు బయటకు తీశాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి సెల్ఫీ తీసుకున్నారు. అలసిపోయిన వధువు వెళ్లి మంచం మీద కూర్చుంది. ``వివాహం తర్వాత మొదటి రాత్రి జరిగేది ఇదే`` అంటూ ఆ వీడియోకు క్యాప్షన్‌గా ఇచ్చారు.
Wife Shocking Decision: నా భర్త సంతోషమే నాకు ముఖ్యం.. వేరే స్త్రీలతో వివాహేతర సంబంధం పెట్టుకున్నా బాధలేదంటూ ఓ భార్య వింత నిర్ణయం..!
ఆ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ``పాపం.. తొలి రాత్రి ఆ వరుడు చాలా కష్టపడ్డాడు. వధువు పెట్టుకున్న పిన్నులను తొలగించడానికే ఫస్ట్‌నైట్‌ను కేటాయించాడు``, ``ఫస్ట్‌నైట్ గురించి సినిమాల్లో చాలా తప్పుగా చూపిస్తున్నారు`` అంటూ కామెంట్లు చేస్తున్నారు. కొందరు ఆ వీడియోను షేర్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Viral News: ఓ విద్యార్థి మార్కుల షీట్ పై.. Passed Out అని రాయబోయి.. Passes Away అని రాసిన టీచర్..!
Updated Date - 2023-03-29T18:33:13+05:30 IST