ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మీ కూతురిపై అత్యాచారం చేసినోడు చచ్చాడు.. కేసు కొట్టేశామన్న కోర్టు.. ఆ తల్లికి నమ్మకం లేక నేరుగా అతడి ఊరికి వెళ్తే..

ABN, First Publish Date - 2023-02-15T14:16:34+05:30

కూతురిని అత్యాచారం చేసిన వ్యక్తిపై తల్లి కేసు వేసింది కానీ అతడు చనిపోయాడనే కారణంతో కోర్టు కేసు కొట్టేసింది కానీ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

12ఏళ్ళ అమాయకమైన బాలిక మీద ఓ నీచుడు అత్యాచారం చేశాడు. ఆ అమ్మాయి విషయం బయటకు చెప్పకుండా లోలోపలే కుమిలిపోయింది. అయితే కూతురు నుండి విషయం తెలుసుకున్న తల్లి పోలీసులను ఆశ్రయించింది. కోర్టులో కేసు వేసింది. ఆరు రోజుల తరువాత అత్యాచారం చేసినవాడు చనిపోయాడని కోర్టు కేసు కొట్టేసింది. కానీ అమ్మాయి తల్లి మాత్రం తన పోరాటం ఆపలేదు. చచ్చిన వ్యక్తిని కోర్టుకు లాగి శిక్ష పడేలా చేసింది. దీనికి సంబంధించి వివరాల్లోకి వెళితే...

2018లో బీహార్ రాష్ట్రంలో 12ఏళ్ళ అమ్మాయి చెరకు తోటలో ఒంటరిగా ఉన్నప్పుడు ఆ అమ్మాయి చదువుకునే స్కూల్ లో టీచర్ గా పనిచేసే నీరజ్ మోదీ అనే 39 ఏళ్ళ వ్యక్తి అమ్మాయి మీద అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇక్కడ జరిగింది మొత్తం వీడియో తీశాను, నువ్వు ఈ విషయం బయటకు చెబితే వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాను అని బెదిరించాడు. దాంతో ఆ అమ్మాయి జరిగిన విషయం బయటకు చెప్పకుండా లోలోపలే కుమిలిపోయింది. అమ్మాయి పరిస్థితి గమనించిన తల్లి విషయం ఆరా తీసి నిజం రాబట్టింది. పోలిస్ స్టేషన్ కు వెళ్ళి ఫిర్యాదు చేసి, కోర్టులో కేసు వేసింది. పోలీసులు అతనిమీద అత్యాచారం అభియోగాలు మోపిన 6రోజుల తరువాత వింత సంఘటన చోటుచేసుకుంది.

నీరజ్ మోడీ మీద కోర్టులో అభియోగాలు నమోదైన 6రోజుల తరువాత నీరజ్ మోదీ తండ్రి ఒక లాయర్ తో కలసి కోర్టుకు వెళ్ళి 'నా కొడుకు చనిపోయాడు ఇదిగోండి ఆధారాలు' అంటూ రెండు ఫోటోలు చూపించాడు. నీరజ్ మోదీ దహనసంస్కారాలు జరిపేటప్పుడు చితికట్టెల మీద పడుకోబెట్టిన ఫోటోలు అవి రెండు. వాటితో పాటు దహన సంస్కారాల కోసం కట్టెలు కొనుగోలు చేసిన రశీదు, అతను చనిపోయినట్టు అధికారులు ఇచ్చిన మరణ ధృవీకరణ పత్రం కూడా అతను కోర్టుకు సమర్పించాడు. ఆధారాలు ఉన్నాయి కదా అని కోర్టు కేసు కొట్టేసింది.

Read also: Shocking Video: రాత్రయితే చాలు బెడ్రూంలోని సీలింగ్‌లోంచి వింత శబ్దాలు.. భయపడుతూనే సీలింగ్‌ను పగలగొట్టి చూస్తే..

తన కూతురిని అత్యాచారం చేసిన వ్యక్తి చనిపోయాడనే విషయం తెలిసి బాలిక తల్లి ఆశ్చర్యపోయింది. ఇందులో ఏదో లొసుగు ఉందనే అనుమానం వచ్చింది ఆమెకు. నేరుగా అతని గ్రామానికి వెళ్ళి ఆ గ్రామంలో ప్రతి ఇల్లూ తిరిగి అతని చావు గురించి ఆరా తీసింది. ప్రతి ఇంటివారూ మాకు తెలియదు అని చెప్పారే కానీ అవును అతను చనిపోయాడు అని చెప్పినవాళ్ళు ఒక్కరూ లేరు. నీరజ్ మోదీ బంధువులు కూడా అతను చనిపోయిన విషయం మాకుతెలీదన్నారు. బాలిక తల్లి ఇంకా లోతుగా ఆరా తీయగా అతని ఇంట్లో ఎలాంటి కర్మలు నిర్వహించలేదని తెలిసింది, కొడుకు చనిపోయినందుకు తండ్రి కనీసం గుండు కూడా చేయించుకోలేదు. దీంతో ఆమె అనుమానం మరింత బలంగా మారింది. ఆమె లాయర్ సహాయంతో మళ్ళీ కోర్టును ఆశ్రయించి కేసును మళ్ళీ ఓపెన్ చేయించింది. తను కనుక్కున్న వివరాలు కోర్టుకు తెలిపింది. దీంతో కోర్టు వారు నీరజ్ మోదీ తండ్రిని పిలిపించారు.

'నీ కొడుకు దహన సంస్కారాలు చేస్తున్నప్పుడు సాక్ష్యులు ఎవరు?' అని అడిగారు. అలాగే కొడుకు చనిపోతే కర్మలు ఎందుకు చేయలేదని, కుటుంబంలో ఎవరో ఒకరు గుండు చేయించుకోవాలి కదా ఎందుకు చేయించుకోలేదని అడిగారు. కోర్టువారు ఒక్కసారిగా ఈ ప్రశ్నలు వేయడంతో నీరజ్ మోదీ తండ్రి తడబడ్డాడు. పొంతనలేని సమాధానాలు చెప్పడంతో అతను దొరికిపోయాడు. చివరికి తాము అంతా డ్రామా ప్లే చేసినట్టు ఒప్పుకున్నారు. అవన్నీ ఫేక్ ఫోటోలని, మరణ ధృవీకరణ పత్రం కూడా ఫేక్ అని, దానికి సాక్ష్యులుగా నీరజ్ మోదీ పనిచేసేస్కూల్ పిల్లల తల్లిదండ్రులతో స్కాలర్షిప్ కోసం అవసరమని సంతకాలు సేకరించాడు, ఆ సంతకాలు ఫోర్జరీ చేసినట్టు ఒప్పుకున్నారు. నీరజ్ మోదీని పోలీసులు తిరిగి అరెస్ట్ చేశారు, ఇతనికి 14ఏళ్ళ శిక్ష విధించారు. ఫోర్జరీ కేసుకింద అతని తండ్రిని కూడా అరెస్ట్ చేశారు. అయితే నీరజ్ మోదీ మరణ ధృవీకరణ పత్రాన్ని సరిగ్గా పరిశీలించకుండా అధికారులు ఎలా జారీచేశారనే విషయంపై కూడా చాలా అనుమానాలు వ్యక్తం చేశారు. ఆ బాలిక మాత్రం చదువు వదిలిపెట్టేసి గంటలు గంటలు చీకటిలో ఉంటోందట. ఆ టీచర్ కు శిక్ష పడినా తన కూతురు జీవితం నాశనం అయిపోయిందని బాలిక తల్లి ఆవేదన వ్యక్తం చేస్తోంది.

Updated Date - 2023-02-15T14:16:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising