Fewest Bones Creatures: అది అత్యంత తక్కువ ఎముకలు కలిగిన జీవి.. అప్పుడప్పుడు తన దంతాలనే మింగేస్తుంది.. పూర్తి వివరాలివే..
ABN, First Publish Date - 2023-04-25T13:24:30+05:30
Fewest Bones Creatures: శరీరంలో ఎముకలు ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అవి శరీరానికి ఆకారాన్నిస్తాయి. కదలికలకు ఎంతగానో సహాయపడతాయి.
Fewest Bones Creatures: శరీరంలో ఎముకలు ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అవి శరీరానికి ఆకారాన్నిస్తాయి. కదలికలకు ఎంతగానో సహాయపడతాయి. శరీరంలో ఎముకలు(bones) ఉండే జీవులను సకశేరుకాలు అంటారు. అటువంటి జీవులు చాలా ఉన్నాయి. మరికొన్నింటిలో చాలా తక్కువ ఎముకలు ఉంటాయి. లేదా వాటికి ఎముకలు ఉండవు.
వీటిని అకశేరుకాలు(Invertebrates) అని అంటారు. ఈ జాబితాలో సముద్ర జీవులు, కీటకాలు, వానపాములు, జలగలు మొదలైనవి ఉంటాయి. అలాంటి కొన్ని జీవుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అతి తక్కువ ఎముకలు కలిగిన జీవులలో షార్క్ ఒకటి. షార్క్ అస్థిపంజరం(skeleton) మృదులాస్థి, కండరాలతో తయారవుతుంది. ఇది ఎముకల కంటే చాలా తక్కువ బరువు కలిగి ఉంటుంది.
ఇలాంటి మృదువైన ఎముకలు మనిషి చెవుల్లో ఉంటాయి. సొరచేపలు(Sharks) చాలా సరళంగా ఉండటానికి ఇదే కారణం. ఈ లక్షణమే అవి అధిక వేగంతో ఈదడానికి సహాయపడుతుంది. సముద్రపు రాజు అని పిలిచే షార్క్ దంతాలు దాని నోటి లోపల వరుసలలో ఉంటాయి. ఈ అడ్డు వరుసలు ముందుకు కదులుతూ ఉంటాయి. అలా కదులుతున్నప్పుడు కొత్త దంతాలు పాత దంతాలను(teeth) బయటకు నెట్టివేస్తాయి.
షార్క్స్ సాధారణంగా వారానికి కనీసం ఒక పంటిని కోల్పోతుంది. దాని పళ్ళు కొన్ని అది ఆహారం(food) తినేటప్పుడు విరిగిపోతాయి. దీంతో అది ఆహారంతో పాటు వాటిని కూడా మింగేస్తుంది. జెల్లీ ఫిష్(Jellyfish) కూడా ఎముకలు లేని జీవుల జాబితాలోకే వస్తుంది. వీటికి వెన్నెముక ఉండదు. అవి తమ చర్మం ద్వారా ఆక్సిజన్‌ను గ్రహిస్తాయి. వానపాము(earthworm)ల్లో కూడా ఎముకలు కనిపించవు. ఎముకలు కనిపించని ఇలాంటి జీవులు చాలానే ఉన్నాయి.
Updated Date - 2023-04-25T13:24:51+05:30 IST