Curd: పెరుగును ఇలా కూడా వాడొచ్చని కలలో కూడా ఊహించి ఉండరు.. జుట్టు రాలే సమస్యకు చెక్ పెట్టాలంటే పెరుగుతో..!
ABN, First Publish Date - 2023-10-27T12:23:14+05:30
ఇంట్లో ఎప్పుడూ స్టాక్ ఉండే పెరుగును ఉపయోగిస్తే జుట్టురాలే సమస్య మంత్రించినట్టు తగ్గిపోతుంది. దాంతో పాటు ఈ లాభాలు కూడా..
జుట్టు రాలడం ఇప్పట్లో చాలామంది విషయంలో ఎదురవుతున్న సమస్య. పిల్లలు, పెద్దలు కూడా ఈ సమస్యతో ఇబ్బంది పడుతుంటారు. అమ్మాయిల జుట్టు పొడవుగా ఉండటం మూలానా అమ్మాయిలలోనే ఇది కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.తల దువ్వినప్పుడు కాస్తో కూస్తో జుట్టురాలడం మామూలే.. కానీ మరీ ఎక్కువగా రాలుతుంటే మాత్రం మగవారిలో బట్టతల, అమ్మాయిలలో జుట్టు పలుచగా మారిపోవడం జరుగుతుంది. ఈ హెయిర్ ఫాల్ నియంత్రించడానికి చాలా మంది మార్కెట్లో దొరికే షాంపూలు, హెయిర్ ఆయిల్స్ వాడి మరింత నష్టపోతుంటారు. కానీ అవేవీ అక్కర్లేదు. ఇంట్లో ఎప్పుడూ స్టాక్ ఉండే పెరుగును ఉపయోగిస్తే జుట్టురాలే(curd for hair fall problems)సమస్య మంత్రించినట్టు తగ్గిపోతుంది. అంతేనా జుట్టు పట్టుకుచ్చులా మెరిసిపోతుంది. జుట్టు పెరగడం మొదలవుతుంది. దీని కోసం పెరుగును ఎలా ఉపయోగించాలో తెలుసుకుంటే..
పెరుగు, ఆలివ్ నూనె..(curd, olive oil)
ఆలివ్ నూనె ఆరోగ్యానికి చాలా మంచిది. జుట్టుపెరుగుదలను కూడా ఇది ప్రోత్సహిస్తుంది. పెరుగు, ఆలివ్ నూనె కాంబినేషన్ హెయిర్ ఫాల్ తగ్గించడంలోనూ, జుట్టు ఒత్తుగా పెరగడంలోనూ మ్యాజిక్ ఫలితాలు ఇస్తుంది. రెండు చెంచాల పెరుగులో ఒక చెంచా ఆలివ్ నూనె వేసి బాగా మిక్స్ చేయాలి. దీన్ని జుట్టు కుదుళ్ళకు బాగా పట్టించి కొన్ని నిమిషాలు మసాజ్ చేయాలి. అరగంట సేపు దీన్ని ఇలాగే వదిలేయాలి. ఆ తరువాత గాఢత లేని షాంపూతో తలస్నానం చేయాలి. వారానికి రెండు సార్లు ఈ టిప్ ఫాలో అవుతుంటే ఊహించని ఫలితాలు చూడొచ్చు.
Viral News: 1300 ఏళ్ల క్రితం నాటి మానవ శరీరంపై.. ఈ వింత రాతలేంటి..? ఈ టాటూను చూసి శాస్త్రవేత్తలే అవాక్కవడం వెనుక..!
పెరుగు, మెంతి గింజలు.. (curd, fenugreek seeds)
మెంతిగింజలు జుట్టు పెరగడానికి చక్కగా పనిచేస్తాయని అందరికీ తెలిసిందే. ఇవి పెరుగుతో కలిస్తే దాని ప్రభావం మరింత పెరుగుతుంది. ఒక కప్పు పెరుగులో కొన్ని నానబెట్టిన మెంతులు వేసి బాగా మిక్సీ పట్టాలి. స్మూత్ పేస్ట్ లా అయిన తరువాత దీన్ని హెయిర్ మాస్క్ లా తలకు అప్లై చేయాలి. నానబెట్టిన మెంతులు లేకపోతే మెంతిపొడిని పెరుగులో వేసి ఒక 10నిమిషాలు దాన్ని ఒక పక్కగా ఉంచి ఆ తరువాత తలకు ప్యాక్ లాగా వేసుకోవచ్చు. దీన్ని జుట్టు కుదుళ్ళ నుండి జుట్టు పొడవునా అప్లై చేయాలి. ఒక గంట తరువాత గాఢత లేని షాంపూతో తలస్నానం చేయాలి. ఈ టిప్ జుట్టు రాలడాన్నే కాదు, చుండ్రు, తలలో దురద వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది.
పెరుగు, ఉల్లిపాయ.. (curd, onion juice)
ఈ మధ్యకాలంలో జుట్టుసంరక్షణలో ఉల్లిపాయ సంచలనం అంతా ఇంతా కాదు. ఉల్లిపాయ నూనెలు, ఉల్లిపాయ షాంపూలు మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయంటే జుట్టు మీద దాని ప్రభావం అర్థం చేసుకోవచ్చు. జుట్టు రాలడం ఆగి, జుట్టు పెరుగుదల అద్భుతంగా ఉండాలంటే పెరుగు, ఉల్లిపాయ చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. 2,3 చెంచాల పెరుగు, 4,5 స్పూన్ల ఉల్లిపాయ రసం తీసుకుని రెండింటిని బాగా మిక్స్ చేయాలి. దీన్ని జుట్టు కుదుళ్లకు బాగా పట్టించి 30నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఆ తరువాత గాఢత లేని షాంపూతో తలస్నానం చేయాలి. వారానికి రెండుసార్లు ఈ టిప్ ఫాలో అయితే జుట్టు రాలడం ఆగి ఒత్తుగా పెరగడం స్పష్టంగా కనిపిస్తుంది.
Viral Video: ఓరి దేవుడో.. దీన్ని ఎలా తింటున్నార్రా నాయనా..? ఇడ్లీలతో ఇలాంటి ప్రయోగాలేంటి..?
Updated Date - 2023-10-27T12:23:14+05:30 IST