Flipkart: లక్ష రూపాయలు పెట్టి సోనీ టీవీ ఆర్డర్ ఇస్తే ఇంటికి ఏం వచ్చిందో తెలుసా?
ABN, First Publish Date - 2023-10-26T15:29:38+05:30
ఆన్‌లైన్‌లో ఒక వస్తువుకు ఆర్డర్ ఇస్తే వేరే వస్తువు డెలివరీ కావడం కొత్తేమీ కాదు. ఇలాంటి అనుభవం ఎదురైనవారు చాలామందే ఉన్నారు. ఇదే తరహాలో మరో వినియోగదారుడికి కూడా ఈ అనుభూతి ఎదురైంది.
ఆన్‌లైన్‌లో ఒక వస్తువుకు ఆర్డర్ ఇస్తే వేరే వస్తువు డెలివరీ కావడం కొత్తేమీ కాదు. ఇలాంటి అనుభవం ఎదురైనవారు చాలామందే ఉన్నారు. ఇదే తరహాలో మరో వినియోగదారుడికి కూడా ఈ అనుభూతి ఎదురైంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ వరకు వేచి చూసి.. పెద్ద టీవీ కొనుక్కొని ఐసీసీ వరల్డ్ కప్ మ్యాచ్‌లు తెగ ఎంజాయ్ చేయొచ్చులే అని ఎదురుచూసిన ఓ కస్టమర్‌కి షాక్ తలిగింది. ఏకంగా రూ.1 లక్ష విలువైన సోనీ టీవీకి ఆర్డర్ ఇస్తే దానికి బదులు థామ్సన్ టీవీ ఇంటికి వచ్చింది. ఉత్సాహంతో పార్శిల్ ఓపెన్ చేసిన అతడు ఒక్కసారిగా కంగారుపడిపోయాడు. తనకు ఎదురైన ఈ అనుభవాన్ని బాధితుడు ఆర్యన్ ట్విటర్ వేదికగా షేర్ చేశాడు. ‘‘ఫ్లిప్‌కార్ట్‌పై అక్టోబర్ 7న సోనీ టీవీని కొన్నాను. 10న డెలివరీ చేశారు. 11న ఇన్‌స్టాల్ చేసే వ్యక్తి వచ్చి పార్శిల్ ఓపెన్ చేశాడు. సోనీ బాక్స్‌ని ఓపెన్ చేసి చూస్తే లోపలి థామ్సన్ టీవీ ఉంది. స్టాండ్, రిమోట్ వంటివి కూడా లేవు’’ అంటూ అందుకు సంబంధించిన ఫొటోలను షేర్ చేశాడు. దీంతో ఈ పోస్ట్ వైరల్‌గా మారింది.
వెంటనే ఈ విషయాన్ని ఫ్లిప్‌కార్ట్ కస్టమర్ కేర్ దృష్టికి తీసుకెళ్లానని వివరించాడు. తాము చెప్పిన విధంగా టీవీ ఫొటోలు అప్‌లోడ్ చేయమంటూ కోరారని, అయినప్పటకీ రెండు వారాలైనా పరిష్కారమవ్వలేదని వెల్లడించాడు. ఆ తర్వాత కూడా పలుమార్లు విజ్ఞప్తి చేసినా టీవీ పంపించలేదని తెలిపాడు. తొలుత అక్టోబర్ 24న పరిష్కరిస్తామన్నారు, కానీ 20నే పరిష్కారమైనట్టు పేర్కొన్నారని బాధిత కస్టమర్ వాపోయాడు.
బాధితుడి పోస్టుపై ఫ్లిప్‌కార్ట్ స్పందించింది. ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురైనందుకు క్షమాపణలు కోరింది. ‘మీ కోసం ఈ సమస్య పరిష్కరిస్తాం. వివరాలను తెలియజేయండి’’ అని ఫ్లిప్‌కార్ట్‌సపోర్ట్ రిప్లై ఇచ్చింది.
Updated Date - 2023-10-26T15:29:38+05:30 IST