ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Dasara: నాని బర్త్‌డే‌కి పిచ్చెక్కించేలా ప్లాన్ చేస్తున్నారుగా..

ABN, First Publish Date - 2023-02-22T18:29:59+05:30

న్యాచురల్ స్టార్ నాని (Natural Star Nani), శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా చిత్రం ‘దసరా’ (Dasara). మార్చి 30న

Nani in Dasara Movie
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యాచురల్ స్టార్ నాని (Natural Star Nani), శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా చిత్రం ‘దసరా’ (Dasara). మార్చి 30న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం పబ్లిసిటీ కార్యక్రమాలపై చిత్రయూనిట్ దృష్టి పెట్టింది. అందులో భాగంగా.. నాని 39వ పుట్టినరోజు (ఫిబ్రవరి 24)ను (Nani 39th Birthday) గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసేందుకు చిత్రబృందం సిద్ధమైంది.

ఈ సినిమాలో నాని కనబడే లుక్ లానే.. బర్త్‌డే సెలబ్రేషన్స్‌ని కూడా మాసివ్‌గా (Massive Birthday Celebrations) ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే 39 లోకేషన్స్‌ని నాని బర్త్‌డే సెలబ్రేషన్స్ కోసం ఎంపిక చేసినట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ విషయం తెలుపుతూ విడుదల చేసిన పోస్టర్ అయితే పిచ్చెక్కించేస్తుంది. ఇందులో నాని లుక్‌ని చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. ముందుంది మాస్ జాతర అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ట్విట్టర్ ప్రొఫైల్ పిక్ మార్చిన నాని:

దసరా చిత్రంతో నాని మేకోవర్‌ (Nani Makeover)కి అసలైన అర్థం చెప్పారు. ఒక నటుడు తాను పోషించే పాత్రలో యాప్ట్, రియల్‌గా కనిపించేలా తనను తాను మార్చుకోవాల్సిన అవసరం ఉందని నాని తన దసరా లుక్‌తో నిరూపించారు. ‘దసరా’లో ఆయన రోజువారీ కూలీగా నటించారు. అందుకోసం అద్భుతమైన మేకోవర్ అయ్యారు నాని. తాజాగా ఆయన మీసాలు దువ్వుతున్న పిక్‌ని ట్విట్టర్‌లో తన ప్రొఫైల్ పిక్‌ (Twitter Profile Pic)గా మార్చారు. ఇందులో గజిబిజి జుట్టు, గడ్డంతో రగ్గడ్ లుక్‌లో మీసాలు తిప్పుతూ కనిపించారు. కాగా.. ఎస్‌ఎల్‌వి సినిమాస్ (SLV Cinemas) బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి (Sudhakar Cherukuri) నిర్మిస్తున్న ఈ సినిమాలో నాని మునుపెన్నడూ చూడని మాస్ క్యారెక్టర్‌లో కనిపించనున్నారు. నాని సరసన కీర్తి సురేష్ (Keerthi Suresh) హీరోయిన్‌గా నటిస్తోంది.

ఇవి కూడా చదవండి

*********************************

Meena: ‘శుభలగ్నం’ రీమేక్ చేస్తే చేయాలనుకున్నా.. కానీ?


Sir: దర్శకుడే కారణం.. చిరు చెప్పిందే మూర్తిగారు చెప్పారు

Premi Viswanath: అరుదైన వ్యాధి.. ‘కార్తీకదీపం’ వంటలక్క కూడా ఆ బ్యాచ్‌లోకి!

Updated Date - 2023-02-22T19:07:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising