ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Shocking: విమానాశ్రయంలో 23 ఏళ్ల కుర్రాడికి లైంగిక వేధింపులు.. వెనకున్న మహిళ చేష్టలతో విసిగిపోయానంటూ నెట్టింట పోస్ట్.. చివరకు..!

ABN, First Publish Date - 2023-11-11T16:13:09+05:30

తనపై ఓ మహిళ ఎయిర్‌పోర్టులో లైంగిక వేధింపులకు దిగిందంటూ ఓ యువకుడు పెట్టిన పోస్ట్ పెద్ద చర్చనీయాంశమైంది.

ఇంటర్నెట్ డెస్క్: తనపై ఓ మహిళ ఎయిర్‌పోర్టులో(Pune airport) లైంగిక వేధింపులకు(Sexual harassment) దిగిందంటూ ఓ యువకుడు నెట్టింట పెట్టిన పోస్ట్ పెద్ద చర్చనీయాంశమైంది. పరిస్థితులు తిరగబడ్డాయని ఆ యువకుడు చేసిన వ్యాఖ్యలకు నెట్టింట పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. అనేక మంది యువకుడిపై సానుభూతి ప్రదర్శించారు. ఇలాంటి సందర్భాల్లో దోషులను పబ్లిక్‌లో నిలబెట్టి దులిపేయాలాంటూ అనేక మంది యువకుడికి సూచించారు. పూణె నుంచి ఢిల్లీ వెళుతున్న సందర్భంగా తనకు ఈ పరిస్థితి ఎదురైందని అతడు చెప్పుకొచ్చాడు(Delhi Man Claims He Was Molested By Woman At Pune Airport).

Shocking Video: చిన్న పిల్లాడిని ఎత్తుకుని పరుగులు తీసిన తండ్రి.. ఏదైనా ఎమర్జెన్సీ అయి ఉంటుందనుకుంటే.. చివరకు షాకింగ్ ట్విస్ట్..!

రెడిట్‌లో(Reddit) బాధిత యువకుడు పెట్టిన పోస్ట్ వైరల్‌గా(Viral) మారింది. నో పర్‌ఫార్మెన్స్5036 పేరిట అతడు పెట్టిన పోస్ట్ అతడి మాటల్లోనే..‘‘ఢిల్లీ విమానం ఎక్కేందుకని అని నేను జోన్ 3లో నిలబడి ఉన్నా. జోన్ 1లోని వారి బోర్డింగ్ అప్పుడే స్టార్టైంది. ఇంతలో నా వెనుక ఓ మహిళ వచ్చి నిలబడింది. ఆమె వయసు 30-35 మధ్య ఉంటాయి. వెనక నిలబడ్డ ఆమె తొలుత కూనిరాగాలు తీయడం మొదలెట్టింది. ఆ తరువాత వీపుపై చేయి వేసి నిమిరింది’’

Police vs Woman: హెల్మెట్ ఏదయ్యా..? నీ హెల్మెట్ ఏది..? అంటూ పోలీసును ఈ మహిళ ఎలా ఆటాడేసుకుందో మీరే చూడండి..!


‘‘నా జీవితంలో ఇలాంటి అనుభవం ఎప్పుడూ ఎదుర్కోలేదు. ఏం జరుగుతోందో అర్థం కాలేదు. ఇలా ఆమె రెండు సార్లు చేసింది. విమానప్రయాణమంతా నేను ఇదే విషయం గురించి ఆలోచిస్తూ ఉండిపోయా. అసలు ఈ ఘటన నిజంగానే జరిగిందా లేక నా ఊహ అన్నది కూడా నాకు అర్థం కాలేదు. అంతా వింతగా అనిపించింది. ఒక అమ్మాయి నన్ను ఇలా, అదీ ఢిల్లీకి వెళుతుండగా ఎయిర్‌పోర్టులో వేధించడం చూస్తే పరిస్థితులు తిరగబడ్డాయని పించింది’’

‘‘విమానం ఢిల్లీలో లాండయ్యాక నేను అమె వద్దకు వెళ్లా. ఇందాక మీరేమైనా నాతో మాట్లాడదామనుకున్నారా? అని ఎంతో మర్యాదగా అడిగా. ఆమె మాత్రం లేదని చాలా పెడసరంగా సమాధానమిచ్చింది. ఆమెకు అకస్మాత్తుగా అంత కోపం వచ్చినందుకు నాకు మరింత ఆశ్చర్యం వేసింది. అనుమానం కూడా బలపడింది. మహిళలు, పురుషుల విషయంలో చట్టాల అన్వయం ఒకే విధంగా ఉండదని నాకు తెలుసు కానీ ఆమె నన్ను కావాలనే తాకిందని మాత్రం నేను బలంగా నమ్ముతున్నాను’’ అని చెప్పుకొచ్చాడు.

Woman Constable: ఈ ఫొటోలోని కానిస్టేబుల్ ఉద్యోగం ఊస్ట్.. తెలియక ఆమె చేసిన ఒక్క మిస్టేక్‌తో పోలీస్ శాఖలో హాట్ టాపిక్..!

యువకుడి పోస్ట్‌కు పెద్ద స్పందన వచ్చింది. కొందరేమో అతడు కథలు చెబుతుండొచ్చని కామెంట్ చేశారు. మరికొందరు మాత్రం ఇలాంటి ఘటనలు ఈ మధ్య తరచూ జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు. ఇలాంటి సందర్భాల్లో నిందితులను అక్కడికక్కడే నిలబెట్టి దులిపేయాలని చాలా మంది సలహా ఇచ్చారు. దీంతో, ఈ పోస్టు వైరల్‌గా మారింది.

NRI: గుడ్ న్యూస్.. హెచ్-1బీ వీసాదారులకు భారీ ఊరట

Updated Date - 2023-11-11T16:25:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising