ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Dengue: ఏ ఆస్పత్రిలో చూసినా డెంగ్యూ రోగులే.. డాక్టర్లు ఇచ్చే మెడిసిన్సే కాదండోయ్.. ఈ వంటింటి చిట్కాలూ డెంగ్యూను తగ్గిస్తాయ్..!

ABN, First Publish Date - 2023-11-03T13:16:01+05:30

. వైద్య చికిత్స తీసుకుంటూ ఈ కింది టిప్స్ కూడా పాటిస్తే ప్రాణాంతక డెంగ్యూ నుంచి తొందరగా బయటపడవచ్చు

ప్రజల ప్రాణాలను బలితీసుకునే విషజ్వరాలలో డెంగ్యూ చాలా ప్రమాదకరమైనది. ఈడిస్ ఈజిప్టి జాతికి చెందిన ఆడ దోమ కుట్టడం వల్ల డెంగ్యూ వస్తుంది. దీనికి నిర్దేశిత ట్రీట్రెంట్ ఏదీ లేకపోవడం వల్ల ప్రజలతో పాటు వైద్యులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాతావరణంలో మార్పులు, తేమతో కూడిన వాతావరణం, వర్షాల కారణంగా దోమల బెడద ఎక్కువై డెంగ్యూ జ్వరాలు విజృంభిస్తాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం ప్రతి సంవత్సరం 400మిలియన్ల మందికి డెంగ్యూ సోకుతోంది. దాదాపు 96మిలియన్ల మంది ప్రమాదానికి దగ్గరగా వెళుతున్నారు. అలసట, రక్తపు వాంతులు, చిగుళ్లలో రక్తస్రావం, విశ్రాంతి లేకపోవడం, తీవ్రమైన కడుపునొప్పి, తలనొప్పి, వికారం, కీళ్లనొప్పులు, కళ్లలోపల నొప్పి, కండరాల నొప్పి వంటి సమస్యలు డెంగ్యూ జ్వర బాధితుల్లో కనిపిస్తాయి. వైద్య చికిత్స తీసుకుంటూ ఈ కింది టిప్స్ కూడా పాటిస్తే ప్రాణాంతక డెంగ్యూ(dengue quick recovery tips) నుంచి తొందరగా బయటపడవచ్చు.

కొబ్బరి నీరు..(Coconut water)

కొబ్బరినీరు శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. ఇది శరీరానికి యాంటీ ఆక్సిడెంట్లను అందిస్తుంది. డెంగ్యూ జ్వరభాధితుల్లో విపరీమైన వాంతులు అవుతున్నప్పడు శరీరానికి శక్తిని అందించడంలోనూ, శరీరంలో నీటి శాతాన్ని భర్తీ చేయడంలోనూ కొబ్బరినీరు బాగా ఉపయోగపడుతుంది. కొబ్బరి నీళ్లలో విటమిన్-సి, కొల్లాజెన్ ను ప్రేరేపించడంలో సహాయపడే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.

Read also: Health Tips: చలికాలంలో వచ్చే సమస్యే ఇది.. అరటిపండ్లతో ఇలా చేయండి చాలు.. కాళ్లకు పగుళ్లు ఉంటే మటాష్..!



వేప రసం..(Neem water)

వేపాకురసం చేదుగా ఉంటుంది కానీ ఇది డెంగ్యూ బాధితులకు చాలాబాగా పనిచేస్తుంది. ఇది డెంగ్యూ వైరల్ పెరుగుదలను నిలిపేస్తుంది. తాజా వేపాకులను నీటిలో వేసి బాగా మరిగించి ఆ నీటిని తాగడం వల్ల డెంగ్యూ వైరస్ ను నియంత్రించడమే కాకుండా ప్లేట్ లెట్ కౌంట్ కూడా పెరుగుతుంది.

నారింజ జ్యూస్..(orange juice)

సిట్రస్ పండ్లలో నారింజ పండు చాలా శక్తివంతమైనది. ఇది యాంటీ ఆక్సిడెంట్లకు పవర్ హౌస్ అని చెప్పవచ్చు. తాజా నారింజ రసం డెంగ్యూ వైరస్ చికిత్సలో చక్కగా సహాయపడుతుంది. శరీరాన్ని తేమగా ఉంచుతుంది. అలసినట్టు ఉండే శరీరానికి శక్తిని ఇస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

మెంతి నీరు..(fenugreek water)

డయాబెటిస్ ఉన్నవారు చాలామంది రాత్రి సమయంలో మెంతులు నీటిలో వేసి ఉదయాన్నేపరగడుపున ఆ నీటిని తాగుతుంటారు. ఇది డెంగ్యూలో కూడా బాగా పనిచేస్తుంది. కీళ్ల నొప్పులు, ఒళ్లు నొప్పులను కంట్రోల్ చేస్తుంది. శరీరంలో వేడి తగ్గించే గుణం కారణంగా డెంగ్యూ వల్ల అధిక ఉష్ట్రోగ్రతలో ఉన్న శరీరాన్ని చల్లబరుస్తుంది.

తులసి..(tulsi water)

తులసి ఆకులను ఆయుర్వేదం గొప్ప ఔషదంగా చెప్పింది. దీంట్లో ఉన్న ఔషద గుణాల కారణంగా ఇది డెంగ్యూ జ్వర చికిత్సలో బాగా పనిచేస్తుంది. తులసి ఆకులను తినడం, తులసి రసాన్ని తీసుకోవడం, తులసి ఆకులను టీలో ఉపయోగించడం, నీటిలో ఉడికించి ఆవిరి పట్టుకోవడం వంటి మార్గాలలో తులసిని ఉపయోగించవచ్చు. ఇది దగ్గు, జలుబు, శ్వాస కోశ సమస్యలను తగ్గిస్తుంది.

Read also: Smoking: పొద్దున్నే సిగరెట్ తాగే అలవాటుందా..? ఈ దారుణ నిజాలు తెలిస్తే అసలు లైటర్ కూడా వెలిగించరేమో..!


Updated Date - 2023-11-03T13:16:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising