Dental Care Tips: ఈ 5 టిప్స్‌లో ఏ ఒక్కదాన్ని పాటించినా.. పళ్లు తెల్లగా మారిపోవడం ఖాయం..!
ABN, First Publish Date - 2023-08-17T16:28:53+05:30
కానీ చాలామందికి పళ్లు గారపట్టి, పళ్లమీద మరకలు ఏర్పడి ఎబ్బెట్టుగా కనిపిస్తుంటాయి. వీటికారణంగా నలుగురిలోకి వెళ్లడానికి భయపడుతుంటారు. కానీ ఈ కింది టిప్స్ లో ఏ ఒక్కటి ఫాలో అయినా పళ్లు తెల్లగా మిలమిలా మెరవడం ఖాయం..
మనిషి రూపాన్ని ప్రభావితం చేసేవాటిలో నవ్వడం, మాట్లాడటం ముఖ్యమైనవి. ఈ రెండింటిలో ఎలాంటి సంకోచం ఉండకూదంటే పళ్లు తెల్లగా ఉండాలి. కానీ చాలామందికి పళ్లు గారపట్టి, పళ్లమీద మరకలు ఏర్పడి ఎబ్బెట్టుగా కనిపిస్తుంటాయి. వీటికారణంగా నలుగురిలోకి వెళ్లడానికి భయపడుతుంటారు. పళ్లను తెల్లగా మార్చుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమవుతుంటారు. కానీ కింద పేర్కొన్న 5 టిప్స్ లో ఏ ఒక్కటి ఫాలో అయినా చాలు. పళ్ళు తెల్లగా మారిపోతాయి. అవేంటో తెలుసుకుంటే..
నాటి ప్రాచీన ఆయుర్వేదం నుండి నేటి వైద్యుల వరకు ప్రతి ఒక్కరూ చెబుతున్న ఉత్తమైన మార్గం ఆయిల్ పుల్లింగ్(Oil pulling). నోటిలో నూనె వేసుకుని పుక్కిలించడమనే ప్రక్రియ పళ్లను దృడంగా ఉంచడమే కాకుండా పళ్ళను తెల్లగా మెరిసేలా చేస్తుంది. ఆయిల్ ఫుల్లింగ్ పళ్ళ మీద ఏర్పడిన ఫలకాన్ని, బ్యాక్టీరియాను సమర్థవంతంగా తొలగిస్తుంది. ఒక స్పూన్ మోతాదు కొబ్బరినూనెను(coconut oil) నోట్లో వేసుకుని సుమారు 10నుండి 15నిమిషాలు పుక్కిలించడం వల్ల పళ్ళ ఆరోగ్యం మెరుగవ్వడమే కాదు, నోరు తాజాగా మారుతుంది.
పళ్లు తెల్లగా మార్చుకోవడానికి చాలాకాలం నుండి ఉపయోగిస్తున్న చిట్కాలో బేకింగ్ సోడా(backing soda) వినియోగం కూడా ఒకటి. దీన్ని సాధారణ టూత్ పేస్ట్ లో మిక్స్ చేసి పళ్లు తోముకోమని చెబుతుంటారు. బేకింగ్ సోడా నోటిలో ఆల్కలీన్ వాతావరణాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఇది బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధిస్తుంది. ఇది మాత్రమే కాకుండా పళ్ళను తెల్లగా చేసే మరొక మ్యాజిక్ రసాయనం హైడ్రోజన్ పెరాక్సైడ్(hydrogen peroxide). ఇది పళ్ళమీద ఫలకాన్ని, గారను తొలగించడంలో సహాయపడుతుంది. నోటిలోని బ్యాక్టీరియాను నిర్మూలిస్తుంది. సాధారణంగా దీన్ని గాయాలకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తుంటారు. కానీ ఇది దంత ససంరక్షణలోనూ ఉపయోగపడుతుంది.
YouTube: యూట్యూబ్ ఆ వీడియోలను ఎందుకు డిలీట్ చేస్తోంది.. కొద్ది వారాల పాటు అదే పనిలో ఉండబోతోందట..!
పళ్ల ఆరోగ్యం గురించి ఆందోళన చెందేవారు, పళ్ళు తెల్లగా మార్చుకోవాలని ప్రయత్నించేవారు చేయాల్సిన ముఖ్యమైన పని ఒకటుంది. అదే పళ్ళ రంగు మార్చే ఆహారపదార్దాలకు(stain foods) దూరంగా ఉండటం. పళ్ళమీద ఎర్రని మరకలు ఏర్పడటానికి కారణమయ్యే శీతలపానీయాలు, కాఫీ, టీ, చాక్లెట్, ఆల్కహాల్, పొగాకు వంటివి పళ్ళను దెబ్బతీస్తాయి. వీటినుండి దూరంగా ఉండాలి.
రంగుమారిన దంతాలను ఎలాంటి ప్రయత్నాలు లేకుండా తెల్లగా మార్చుకోవడానికి ఉన్న ఒక ముఖ్య మార్గం బ్లీచ్(bleach) చేయించుకోవడం. దీనివల్ల పైకి కనిపించే మరకలు, గార మాత్రమే కాదు. పళ్ళ మూలల్లో ఉన్న రంగు కూడా తొలగిపోతుంది. పైగా ఇది శాశ్వత పరిష్కారం. దీని తరువాత దంత సంరక్షణ క్రమం తప్పకుండా ఫాలో అయితే పళ్ళ రంగు ఎప్పటికీ మారదు.
ప్రతిరోజు ఉదయం, రాత్రి పడుకునేముందు శుభ్రంగా, సున్నితంగా పళ్లు తోముకోవాలి. దీనివల్ల నోటిలోని బ్యాక్టీరియాను తొలగించడం సులువు అవుతుంది. ఇక ఫ్లాష్(flash) ను ఉపయోగించి పళ్ళమీద మరకలను, పళ్ళమీద గారను తొలగించవచ్చు. పళ్ళ ఆరోగ్యం బాగుండాలన్నా, పళ్లు రంగు మారకుండా ఉండాలన్నా 6నెలలకు ఒకసారి దంత వైద్యుడిని సంప్రదించాలని నిపుణులు చెబుతారు. దంత వైద్యుడిని తరచుగా కన్సల్ట్ అవుతుంటే పళ్లు రంగుమారకుండా జాగ్రత్త పడచ్చు.
Sleeping: రాత్రిళ్లు సరిగా నిద్రపోవడం లేదా..? రోజుకు 5 గంటల కంటే తక్కువసేపు పడుకుంటే జరిగేది ఇదే..!
Updated Date - 2023-08-17T16:28:53+05:30 IST