Bangladesh: బంగ్లాదేశ్‌లో తెలుగు వారికి కష్టాలు.. వారి ఇళ్లు కూల్చివేయాలని నిర్ణయం.. అసలు తెలుగు వారు అక్కడ ఏ చేస్తుంటారంటే..
ABN, First Publish Date - 2023-02-17T19:56:53+05:30
స్వాతంత్య్రానికి పూర్వం అవిభాజ్య భారతదేశంలో ప్రస్తుత బంగ్లాదేశ్ కూడా ఓ భాగం.. ఢాకాలో పారిశుద్ధ్య కార్మికులుగా పని చేసేందుకు 19వ శతాబ్దంలో తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలకు చెందిన కొందరు వ్యక్తులను బ్రిటీష్ ప్రభుత్వం తీసుకెళ్లింది..
స్వాతంత్య్రానికి పూర్వం అవిభాజ్య భారతదేశంలో ప్రస్తుత బంగ్లాదేశ్ కూడా ఓ భాగం.. ఢాకాలో పారిశుద్ధ్య కార్మికులుగా పని చేసేందుకు 19వ శతాబ్దంలో తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలకు చెందిన కొందరు వ్యక్తులను బ్రిటీష్ ప్రభుత్వం తీసుకెళ్లింది.. అక్కడ వారికి స్థిర నివాసం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది.. అప్పుడు అక్కడకు వెళ్లిన తెలుగువారు ఇప్పటికీ అక్కడే దుర్భర దారిద్ర్యంలో బతుకుతున్నారు.. ఢాకాలో పారిశుద్ధ్య కార్మికులుగా పని చేస్తున్నారు.. సొంత ఇంటి కల మాత్రం ఇప్పటికీ నెరవేరలేదు..
బంగ్లాదేశ్ (Bangladesh) రాజధాని ఢాకాలోని జత్రబరి దాల్పూర్ ప్రాంతంలో 1990 నుంచి అంటే దాదాపు 30 ఏళ్లుగా కొన్ని తెలుగు కుటుంబాలు నివసిస్తున్నాయి. వీరిలో చాలా మంది తెలుగు వారు ఢాకాలోని పారిశుద్ధ్య కార్మికులుగా పని చేస్తుంటారు. ఇంత కాలం ఆ ప్రాంతంలో ఎలాగోలా నివసించిన తెలుగు వారికి తాజాగా ఢాకా దక్షిణ నగర పాలక సంస్థ (Dhaka South City Corporation) షాకిచ్చింది. ఆ కాలనీ మొత్తాన్ని ఖాళీ చేయాలని ఆదేశించింది.. దీంతో ఆ ప్రాంతంలో ఆందోళనలు మొదలయ్యాయి.
ఢాకాలోని జత్రబరి దాల్పూర్‌లో తెలుగు మాట్లాడే పారిశుద్ధ్య కార్మికుల కాలనీ నెంబర్ 14కి కొద్ది రోజుల కిందట పోలీసులు వచ్చారు (Telegu people in Bangladesh). ఆ కాలనీ ఖాళీ చేయాలని వారిని ఆదేశించారు. చాలా కాలంగా ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూమిలో కొందరు ఇళ్లు నిర్మించుకున్నారు. అవి అక్రమ నిర్మాణాలు అంటూ సిటీ కార్పొరేషన్ తాజాగా ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకుంటోంది. దీంతో తెలుగు వారిలో గుబులు మొదలైంది. తాము ఇప్పుడు ఎక్కడికి వెళ్లాలని, కొత్తగా ఇళ్లు కట్టుకునేంత స్థోమత తమకు లేదని వాపోతున్నారు. బంగ్లాదేశలో స్థిర నివాసం కల్పిస్తామనే భరోసాతో ఎన్నో ఏళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి తమ పూర్వీకులను బ్రిటీషర్లు ఇక్కడికి తీసుకొచ్చారని, అప్పటి నుంచి తామంతా పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్నట్లు ఓ వృద్ధురాలు తెలిపారు.
అమ్మ బాబోయ్.. 13 ఏళ్లు కూడా నిండకుండానే ఏడాదికి రూ.18 లక్షల జీతం.. ఇంతకీ ఈ పిల్లలు చేస్తున్న జాబ్ ఏంటో తెలిస్తే..!
ఢాకాలోని జత్రబరి దాల్పూర్‌లో నివసించేందుకు 1990లో తమకు అనుమతి ఇచ్చారని, అప్పుడు దాదాపు 130 కుటుంబాలు వరకు అక్కడే నివాసాలు ఏర్పరుచుకుని జీవనం సాగిస్తున్నామని, ఇప్పుడు ఆ స్థలాన్ని కూడా స్వాధీనం చేసుకుంటన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్‌కు స్వాతంత్య్రం వచ్చి ఏళ్లు గడిచినప్పటికీ, ఇంకా తమకి శాశ్వత నివాసం లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, తాము ఎవరినీ బలవంతంగా ఖాళీ చేయించడం లేదని, అందరికీ పునరావాసం కల్పిస్తామని డీఎస్‌సీసీ అధికారులు చెబుతున్నారు.
Updated Date - 2023-02-17T19:56:55+05:30 IST