ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

షర్టుకి, బుష్ షర్టుకి తేడా తెలియకపోతే గతంలోకి ఇలా తొంగిచూడాల్సిందే..

ABN, First Publish Date - 2023-04-19T12:52:48+05:30

పురుషులు ధరించే షర్టును కొందరు బుష్ షర్టు(Bush shirt) అని అంటుంటారు. ఇంతకీ షర్టుకి, బుష్ షర్టుకు తేడా ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పురుషులు ధరించే షర్టును కొందరు బుష్ షర్టు(Bush shirt) అని అంటుంటారు. ఇంతకీ షర్టుకి, బుష్ షర్టుకు తేడా ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. బుష్ షర్ట్‌కు, షర్ట్‌కు చాలా తేడా ఉంది. బుష్ షర్ట్ అనేది పొడవుగా ఉండి, వదులుగా ఉంటుంది. ఇది కాటన్‌(Cotton)తో తయారవుతుంది.

దీనికి మధ్యలో బెల్ట్ కూడా ఉంటుంది. బుష్ షర్టులకు ఐదు పాకెట్లు ఉంటాయి. బుష్ షర్టు పైభాగంలో రెండు పాకెట్లు, దిగువన 2 పాకెట్లు ఉంటాయి. బుష్ షర్ట్ ఒక జాకెట్(jacket) మాదిరిగా కనిపిస్తుంది. బుష్ షర్టులను ఉన్నితో కూడా తయారు చేస్తారు. బుష్ షర్టులు ఎక్కువగా ముదురు బూడిద రంగు(gray color), ఖాకీ తదితర రంగులలో ఉంటాయి.

ఇతర షర్టులతో పోలిస్తే ఇది రంగులో లేదా డిజైన్‌లో అంత ఆకర్షణీయంగా ఉండదు. బుష్ షర్ట్‌ను సఫారీ జాకెట్(Safari jacket) అని కూడా అంటారు. బుష్ షర్ట్ వదులుగా ఉంటుంది. ప్రయాణ సమయంలో ఇది ధరించడం చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. గతంలో దీనిని గ్రామీణ ప్రాంతాల్లో(rural areas) ధరించేవారు. ముఖ్యంగా వేటగాళ్ళు దీనిని ధరించేవారు.

దీనికి గల జేబులను వివిధ సాధనాలను ఉంచేందుకు ఉపయోగించవచ్చు. కాలక్రమేణా బుష్ షర్ట్ ఫ్యాషన్(Fashion) పాతబడింది, ఈ రోజుల్లో ధరిస్తున్న షర్టు దాని స్థానాన్ని ఆక్రమించింది. కాగా ఇటీవలి సంవత్సరాలలో బుష్ షర్టులపై ఆసక్తి తిరిగి పెరిగింది. అనేక రకాల ఫాబ్రిక్‌లతో(fabrics) బుష్ షర్టులను తయారు చేస్తున్నారు. వివిధ రకాల డిజైన్లలో తీర్చిదిద్దుతున్నారు.

Updated Date - 2023-04-19T13:56:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising