Lakshmi Deepta: అశ్లీల సన్నివేశంలో నటించాలని యువకుడిని బలవంతం చేసిన మహిళ డైరెక్టర్.. అరెస్టు చేసిన పోలీసులు..

ABN, First Publish Date - 2023-02-26T18:45:47+05:30

కరోనా అనంతరం ఓటీటీల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ప్రజలు కూడా వెబ్‌సిరీస్‌(Webseries) లను చూడటానికి ఇష్టపడుతున్నారు. డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ కూడా కొత్త రకం కంటెంట్‌ను అందిస్తున్నాయి.

 Lakshmi Deepta: అశ్లీల సన్నివేశంలో నటించాలని యువకుడిని బలవంతం చేసిన మహిళ డైరెక్టర్.. అరెస్టు చేసిన పోలీసులు..
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరోనా అనంతరం ఓటీటీల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ప్రజలు కూడా వెబ్‌సిరీస్‌(Webseries) లను చూడటానికి ఇష్టపడుతున్నారు. డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ కూడా కొత్త రకం కంటెంట్‌ను అందిస్తున్నాయి. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో వచ్చే కంటెంట్‌లో అసభ్య పదజాలం, అశ్లీల సన్నివేశాలు ఎక్కువగా ఉంటున్నాయి. కంటెంట్‌కు సెన్సార్ షిప్ ఉండకపోవడం కూడా అందుకు దోహదం చేస్తుంది. అయితే, కోలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో ఓ ఘటన సంచలనం సృష్టించింది. ఓ మహిళ డైరెక్టర్ వెబ్‌సిరీస్‌‌లోని అశ్లీల సన్నివేశంలో నటించాలని అప్‌కమింగ్ నటుడిని బలవంతం చేశారు. ఫలితంగా ఆ డైరెక్టర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

లక్ష్మీ దీప్త (Lakshmi Deepta) కేరళలొని కొట్టాయంకు చెందినవారు. పలు వెబ్‌సిరీస్‌లకు దర్శకత్వం వహించారు. ఆమె తెరకెక్కించిన షోస్‌లో ఎక్కువగా అడల్ట్ కంటెంటే ఉంది. నటుల కోసం కొన్ని రోజుల క్రితం ఆమె ఓ యాడ్ ఇచ్చారు. ఈ యాడ్‌ను చూసిన యువకుడు ఆమెను సంప్రదించారు. లక్ష్మీ అవకాశమిస్తానని చెప్పి యువకుడితో కాంట్రాక్ట్‌పై సంతకం చేయించుకున్నారు. అనంతరం అరువ్వకరా ప్రాంతంలో వెబ్‌సిరీస్ షూటింగ్‌ను మొదలుపెట్టారు. ఆశ్లీల సన్నివేశంలో నటించాలని యువకుడిని బలవంతం చేశారు. కానీ, ఆయన మాత్రం సన్నివేశం చేసేందుకు అంగీకరించలేదు. కాంట్రాక్ట్‌పై సంతకం చేసి సన్నివేశం చేయకపోతే రూ.5లక్షలు చెల్లించాలని ఆమె యువకుడిని బెదిరించారు. మరో ఆప్షన్ లేకపోవడంతో ఆయన సీన్‌ను పూర్తి చేశారు. అనంతరం ఆ యువకుడు ఆమెపై పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. వెబ్‌సిరీస్‌ను నిషేధించాలని కోరారు. ఒకవేళ అది కనుక ప్రసారం అయితే తమ కుటుంబంపై ప్రభావం పడుతుందని చెప్పారు. దీంతో పోలీసులు లక్ష్మీని అరెస్టు చేశారు. కోర్టు ముందు హాజరుపర్చారు. ప్రస్తుతం ఆమె షరతులతో కూడిన బెయిల్‌పై బయట ఉన్నారు.

^^^^^^^^^^^^^^^^^^^^^^

ఇవి కూడా చదవండి:

Ashwini Dutt: ‘ప్రాజెక్ట్ కె’ ఆసక్తికర సంగతులు చెప్పిన నిర్మాత.. మ్యూజిక్ డైరెక్టర్‌లో మార్పు..

Ranbir Kapoor: బెస్ట్ యాక్టర్ అవార్డును అందుకునే అర్హత నాకు లేదు.. ‘పుష్ప’ లో అల్లు అర్జున్ అద్భుతంగా..

RRR: ఇంటర్నేషనల్ అవార్డ్స్‌లో టామ్ క్రూజ్, బ్రాడ్ పిట్‌లతో పోటీ పడుతున్న రామ్ చరణ్, తారక్

Vishal: భారీ ప్రమాదం.. కొంచముంటే విశాల్ ప్రాణాలు పోయేవి.. వీడియో వైరల్

Nani: నెపోటిజానికి కారణం ప్రేక్షకులే..!

Updated Date - 2023-02-26T18:51:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising