‘రైలు రెండో నంబరు ప్లాట్ ఫారంనకు వచ్చి ఉన్నది’.. అనౌన్స్‌మెంట్ వినగానే... కంగారు పడుతూ 2కి.మీ. దూరం వెళ్లేందుకు సిద్ధమైన ప్రయాణికులు... కారణమేమిటో తెలిస్తే..
ABN, First Publish Date - 2023-05-02T10:26:45+05:30
ఏ రైల్వే స్టేషన్‌లోనైనా ప్లాట్‌ఫారాలు పక్కపక్కనే ఉంటాయనే సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఆ రైల్వే స్టేషన్(Railway station)లో దీనికి భిన్నంగా ఉంటుంది. అక్కడి రెండు ప్లాట్‌ఫారాల మధ్య దూరం ఎంతో తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే.
ఏ రైల్వే స్టేషన్‌లోనైనా ప్లాట్‌ఫారాలు పక్కపక్కనే ఉంటాయనే సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఆ రైల్వే స్టేషన్(Railway station)లో దీనికి భిన్నంగా ఉంటుంది. అక్కడి రెండు ప్లాట్‌ఫారాల మధ్య దూరం ఎంతో తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. అది..భారతీయ రైల్వేకు చెందిన ప్రత్యేకమైన రైల్వే స్టేషన్(special railway station). అక్కడ ప్లాట్‌ఫారమ్‌ల మధ్య 2 కిలోమీటర్ల దూరం ఉంది.
అదే గంగా నది ఒడ్డున ఉన్న బీహార్(Bihar)లోని బెగుసరాయ్ జిల్లాలోని బరౌనిలో నిర్మితమైన రైల్వే స్టేషన్. ఈ ప్రాంతం పారిశ్రామిక పట్టణం(Industrial town)గానూ పేరొందింది. ఈ పట్టణం ఆయిల్ రిఫైనరీ, థర్మల్ పవర్ ప్లాంట్‌కు ప్రసిద్ధి చెందింది. ఈ ప్రత్యేకమైన రైల్వే స్టేషన్(Railway station)ను బరౌని జంక్షన్ అని పిలుస్తారు.
దీనిని 1883లో నిర్మించారు. అప్పట్లో ఈ రైల్వే స్టేషన్‌లో ఒక ప్లాట్‌ఫారమ్(Platform) ఏర్పాటు చేశారు. ఈ మార్గంలో బరౌని జంక్షన్ నుండి వివిధ డివిజన్లకు రైళ్లు నడిచేవి. అయితే ఈ ఒకటో నంబర్ ప్లాట్‌ఫారమ్‌పై గూడ్స్ రైళ్లు మాత్రమే నడిచేవి. అయితే కొంత కాలం తర్వాత స్థానికుల(natives) వినతి మేరకు మరో బరౌని జంక్షన్ నిర్మించాలని రైల్వే అధికారులు నిర్ణయించారు.
దీంతో ఈ బరౌని జంక్షన్‌కు రెండు కిలోమీటర్ల దూరంలో మరో బరౌని రైల్వే స్టేషన్(Barauni Railway Station) నిర్మితమయ్యింది. రెండవ స్టేషన్‌లో ఒక ప్లాట్‌ఫారమ్ ఏర్పాటు చేశారు. దీంతో ఒకే ప్రాంతంలో రెండు కిలోమీటర్ల దూరంలో ఒకే పేరుతో రెండు రైల్వే ప్లాట్‌ఫారాలు ఏర్పాటయ్యాయి. కొత్త బరౌనీ రైల్వే స్టేషన్ పూర్తయిన తరువాత పాత బరౌనీ రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫారమ్‌కు నంబర్ వన్(Number one) అనే పేరును తొలగించారు.
ఆ పాత బరౌనీ రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫారమ్ సంఖ్య 2గా మారింది. దీని తర్వాత అక్కడ మరికొన్ని ప్లాట్ ఫారాలు ఏర్పాటయ్యాయి. దీంతో ఎంతో ప్రత్యేకత కలిగిన రైల్వే స్టేషన్‌గా మారిపోయింది. అయితే ఇక్కడ ఒకటవ నంబర్ ప్లాట్‌ఫారమ్ లేదు. ఒకే రైల్వే స్టేషన్‌కు చెందిన రెండు ప్లాట్ ఫారాలు రెండు కిలోమీటర్ల దూరంలో ఉండటంతో ప్రయాణికులు ఇబ్బందులు(difficulties) పడాల్సి వస్తోంది. ఒకటో నంబర్ ప్లాట్‌ఫారమ్‌పై ఉన్న ప్రయాణికులు... రైలు రెండవ ప్లాట్ ఫారానికి వస్తున్నదని తెలిస్తే... వారు రెండు కిలోమీటర్ల దూరం ప్రయాణించి, ఆ రెండవ రైల్వే ప్లాట్‌ఫారానికి సమయానికి చేరుకోవాల్సి ఉంటుంది.
Updated Date - 2023-05-02T10:31:09+05:30 IST