ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

vomiting after eating food: తిన్న వెంటనే వాంతులా... కంగారు పడకుండా... ఈ సమస్యల్లో ఏదైనా ఉందేమో చెక్ చేసుకోండి!

ABN, First Publish Date - 2023-03-29T10:18:22+05:30

vomiting after eating food: అన్నం తిన్న వెంటనే వాంతులు(vomiting) అవుతున్నట్లు అనిపిస్తే ఆ ఆహారం శరీరంలో కదలాల్సిన వేగంతో ముందుకు కదలడం లేదని అర్థం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

vomiting after eating food: అన్నం తిన్న వెంటనే వాంతులు(vomiting) అవుతున్నట్లు అనిపిస్తే ఆ ఆహారం శరీరంలో కదలాల్సిన వేగంతో ముందుకు కదలడం లేదని అర్థం. ఇది జరిగినప్పుడు యాసిడ్ రిఫ్లక్స్(Acid reflux) తలెత్తుతుంది. తిన్న వెంటనే వాంతులు మొదలవుతాయి. మీ జీర్ణశక్తి(Digestive power) సరిగా లేదని దీని అర్థం. ఎసిడిటీ సమస్య ఉంటే తిన్న వెంటనే వాంతులు వచ్చినట్లు అనిపిస్తుంది. కొన్ని ఆహారాల కారణంగా కడుపులో ఆమ్లం(acid) ఏర్పడుతుంది. ఇది జరిగితే తిన్న వెంటనే వాంతులు సంభవించవచ్చు. తిన్న వెంటనే వాంతులు అయ్యే సమస్య జాండిస్(Jaundice) వల్ల కూడా రావచ్చు. కామెర్ల వ్యాధి వచ్చినప్పుడు బాధితుని జీర్ణ శక్తి బలహీనపడుతుంది. ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. దీని కారణంగా పదేపదే వాంతులు వచ్చే సమస్య తలెత్తుతుంది. అల్సర్లు(Ulcers), కాలేయం లేదా కిడ్నీలో రాళ్లు వంటి సమస్యలు ఉంటే వాంతులు వస్తుంటాయి. వాంతుల నివారణకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో నిపుణులు తెలిపారు. వీటిలో మొదటిది వేయించిన, స్పైసీ ఫుడ్‌(Spicy food)కు దూరంగా ఉండాలి. ఈ ఆహారానికి దూరంగా ఉండలేకపోతే స్వల్పంగా తీసుకోండి. ఖాళీ కడుపు(empty stomach)తో ఎక్కువ ఆహారం తీసుకోకండి. అలాగే ఒకేసారి ఎక్కువ ఆహారం తినకూడదు. భోజనంతో పాటు టీ, కాఫీ, కార్బోనేటేడ్ వాటర్, ఎనర్జీ డ్రింక్స్(Energy drinks) మొదలైన కెఫిన్ ఉన్న వాటిని ఎప్పుడూ తీసుకోవద్దు. ఎక్కువ సేపు ఖాళీ కడుపుతో ఉండకండి. ప్రతి 3-4 గంటలకు క్రమం తప్పకుండా ఏదైనా తినడం ఉత్తమం. ఆహారం తిన్న వెంటనే ఎలాంటి వ్యాయామాలు(Exercises) చేయకూడదు. అయితే ఉదయం వ్యాయామానికి ముందు కొద్దిగా పోషకాహారం(nutrition) తీసుకోవడం ఉత్తమం.

Updated Date - 2023-03-29T10:58:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising