ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Health Tips: నిద్రలో పళ్లు నూరే అలవాటు ఉందా? వెంటనే జాగ్రత్త పడండి.. లేకపోతే ఆ సమస్య రావడం ఖాయం!.

ABN, First Publish Date - 2023-09-09T12:06:37+05:30

కొంత మంది వ్యక్తులు నిద్రపోతున్న సమయంలో వారికి తెలియకుండానే పళ్లు నూరుతుంటారు. ఆ సౌండ్ కూడా బయటకు వస్తుంటుంది. చూడడానికి ఇది చాలా చిన్న సమస్యే కావొచ్చు కానీ, ఇలా నిద్రలో పళ్లు నూరడానికి కొన్ని కారణాలు ఉన్నాయట. అలాగే ఈ అలవాటు పలు అనారోగ్య సమస్యలకు కూడా కారణమవుతుందట.

కొంత మంది వ్యక్తులు నిద్రపోతున్న సమయంలో వారికి తెలియకుండానే పళ్లు (Teeth) నూరుతుంటారు. ఆ సౌండ్ కూడా బయటకు వస్తుంటుంది. చూడడానికి ఇది చాలా చిన్న సమస్యే కావొచ్చు కానీ, ఇలా నిద్రలో పళ్లు నూరడానికి (Teeth Grinding) కొన్ని కారణాలు ఉన్నాయట. అలాగే ఈ అలవాటు పలు అనారోగ్య సమస్యలకు కూడా కారణమవుతుందట. ఇలా నిద్రలో పళ్లు నూరడాన్ని ``స్లీప్ బ్రక్సిజమ్`` (Sleep bruxism) అంటారు. అప్పుడప్పుడు నిద్రలో చేయడం పెద్ద సమస్య కాదు.. కానీ, తరచుగా నిద్రలో పళ్లు నూరడం మాత్రం పట్టించుకోవాల్సిన విషయమే అని నిపుణులు హెచ్చరిస్తున్నారు (Health Tips).

ఇలా నిద్రలో పళ్లు నూరడానికి పలు కారణాలున్నాయట. ఎక్కువ ఆందోళన (Anxiety), ఒత్తిడి (Stress)కి గురయ్యేవారు ఇలా నిద్రలో పళ్లు నూరుతుంటారట. అలాగే నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నవారు కూడా ఇలా చేస్తారట. కెఫిన్, మద్యం, ధూమపానం కూడా పళ్లు నూరడానికి కారణం కావొచ్చట. యాంటీ డిప్రెసెంట్స్, యాంటిసైకోటిక్స్ వంటి మందులు వాడే వారు కూడా ఈ ``స్లీప్ బ్రక్సిజమ్`` అనే లక్షణం ప్రదర్శిస్తారట. ఇక, పార్కిన్సన్స్, హంటింగ్టన్'స్ వంటి నాడీ వ్యవస్థ వ్యాధులతో బాధపడుతున్న వారు కూడా నిద్రలో పళ్లు నూరుతారట.

Viral News: దీన్ని తినాలంటే కోటీశ్వరులకే సాధ్యం.. ఒక్క కేజీ ధర ఏకంగా రూ.13.50 లక్షలట.. ఇంతకీ ఇదేంటంటే..!

నిద్రలో పళ్లు నూరడం వల్ల దంతాలు అరిగిపోయి తీవ్ర నష్టం వాటిల్లో అవకాశం ఉంది. అంతేకాదు ఈ అలవాటు వల్ల కొందరిలో పార్శ్వ నొప్పి కూడా మొదలయ్యే ప్రమాదం ఉందట. ఈ అలవాటు వల్ల దంతాల సున్నితత్వం దెబ్బ తినడమే కాకుండా చెవి నొప్పి, దవడ నొప్పులు మొదలయ్యే ప్రమాదాలు ఉన్నాయి. ఈ అలవాటును దూరం చేసుకోవాలంటే ముందుగా ఒత్తిడిని, ఆందోళనను వదిలించుకోవాలి. ముఖ్యంగా నిద్రపోయే ముందు పళ్ల మధ్యలో మౌత్‌గార్డ్ ధరించడం అత్యుత్తమ పరిష్కారం. అలాగే కెఫిన్, ఆల్కహాల్‌కు వీలైనంత దూరంగా ఉండడం మంచిది.

Updated Date - 2023-09-09T12:06:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising