చుక్కలు చూపిస్తున్న గది.. గంట కూడా ఉండలేక భయంతో పరుగులు.. దెయ్యం కాదు.. భూతం కాదు.. అసలు కారణమేంటంటే..
ABN, First Publish Date - 2023-02-04T21:09:31+05:30
ఈ గదినీ మిగతా గదుల తరహాలోనే మనుషులే నిర్మించారు. దీనికి కూడా నాలుగు గోడలు, తలుపే ఉంటుంది. కానీ ఇందులో ఉండాలంటేనే జనం వణికిపోతున్నారు. అలాగని ఇందులో ఎలాంటి దయ్యాలూ, భూతాలూ లేవు. అయినా..
ఈ గదినీ మిగతా గదుల తరహాలోనే మనుషులే నిర్మించారు. దీనికి కూడా నాలుగు గోడలు, తలుపే ఉంటుంది. కానీ ఇందులో ఉండాలంటేనే జనం వణికిపోతున్నారు. అలాగని ఇందులో ఎలాంటి దయ్యాలూ, భూతాలూ లేవు. అయినా ఎవరూ ఇందులో ఉండటానికి సాహసించలేదు. కనీసం గంట కూడా ఉండలేకపోతున్నారంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఇంతకీ ఆ గది ఎక్కడుంది, ఎందుకు ఇందులో ఎవరూ ఉండలేకపోతున్నారు.. తదితర వివరాల్లోకి వెళితే..
వాషింగ్టన్‌లోని (Washington) రెడ్‌మండ్ మైక్రోసాఫ్ట్ హెడ్‌క్వార్టర్స్‌లో నిర్మించిన భవనంలో ఈ గది (room) ఉంది. ఈ గదిలో ఎంతో ప్రశాంతత నెలకొని ఉంటుంది. ప్రశాంతత ఉంటే ఉండటానికి ఏం ఇబ్బందీ అని మీకు సందేహం రావచ్చు. మీలాగే చాలా మంది అలా అనుకునే లోపలికి వెళ్లారు.. కానీ గంట కూడా కాక ముందే వామ్మో! మా వల్ల కాదు బాబోయ్.. అంటూ బయటకు పరుగెత్తుకుంటూ వచ్చారు. ప్రపంచంలోనే అత్యంత నిశ్శబ్ధ గదిగా.. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి (Guinness Book of Records) కూడా ఎక్కింది. ఈ గదిలో మనుషులు వినే కనీస సామర్థ్యం కంటే 20 డెసిబుల్స్ తక్కువ నిశ్శబ్ధం ఆవరించి ఉంటుంది. ఈ కారణంగా ఇందులో ఉన్న వారి గుండె చప్పుడు, సిరల్లో ప్రవహించే రక్తంతో పాటూ ఆఖరికి ఎముకల శబ్ధాలు కూడా వినవచ్చట.
మీ దగ్గర రూ.10 కాయిన్స్ ఉన్నాయా..? అయితే ఈ వార్తను మీరు తప్పకుండా చదివి తీరాల్సిందే..!
మైనస్ 20.3 డెసిబుల్స్ (decibels) నిశ్శబ్ధం నెలకొని ఉన్న ఈ గదిని మైక్రోసాఫ్ట్ కోసం 2015లో హుండ్‌రాజ్ గోపాల్ నిర్మించారు. కాంక్రీటు, ఉక్కుతో తయారు చేసిన ఆరు గోడలను కలపడం ద్వారా ఈ ఛాంబర్‌ను (quietest room) నిర్మించారు. దీంతో ఈ గది.. ప్రపంచంతో ఏమాత్రం సంబంధం లేనట్లుగా ఉంటుంది. వివిధ ధ్వని పరికరాలను పరీక్షించడానికి దీన్ని ఏర్పాటు చేశారట. ఇందులో ఇప్పటి వరకూ 55 నిముషాల కంటే ఎక్కువ సేపు ఎవరూ ఉండలేదట. ప్రస్తుతం ఈ గదికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు.. సోషల్ మీడియాలో వైరల్ (Viral photos and videos) అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు పెడుతున్నారు.
Updated Date - 2023-02-04T21:09:44+05:30 IST