ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Coffee: మీరు కాఫీ ప్రియులా? అయితే ఈ కుక్కర్ కాఫీని ఒకసారి తాగి చూడండి.. వైరల్ అవుతున్న వీడియో!

ABN, First Publish Date - 2023-11-05T20:58:20+05:30

మన దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే చాలా మంది కాఫీతోనే తమ రోజును ప్రారంభిస్తారు. ఉదయాన్నే ఘుమఘుమలాడే వేడి వేడి కాఫీని సిప్ చేసేందుకు ఇష్టపడుతుంటారు. ప్రపంచవ్యాప్తంగా కాఫీని రకరకాలుగా తయారు చేస్తారు. కాఫీని కొందరు స్ట్రాంగ్‌గా ఇష్టపడతారు, మరికొందరు క్రీమీగా ఇష్టపడతారు.

మన దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే చాలా మంది కాఫీతోనే (Coffee) తమ రోజును ప్రారంభిస్తారు. ఉదయాన్నే ఘుమఘుమలాడే వేడి వేడి కాఫీని (Hot Coffee) సిప్ చేసేందుకు ఇష్టపడుతుంటారు. ప్రపంచవ్యాప్తంగా కాఫీని రకరకాలుగా తయారు చేస్తారు. కాఫీని కొందరు స్ట్రాంగ్‌గా ఇష్టపడతారు, మరికొందరు క్రీమీగా ఇష్టపడతారు. కొందరు ఇన్‌స్టంట్ పౌడర్‌తో కాఫీని తయారు చేస్తారు. మరికొందరు ఫిల్టర్ కాఫీ (Filter Coffee)కే కట్టుబడి ఉంటారు. అయితే తాజాగా వైరల్ అవుతున్న ఓ వీడియో (Viral Video)లో కుక్కర్‌తో కాఫీని మరిగిస్తున్నారు. ఆ వీడియో చాలా మందిని ఆకట్టుకుంటోంది.

thegreatindianfoodie అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ వ్యక్తి సైకిల్ మీద స్టవ్ ఏర్పాటు చేసుకుని దాని మీద ప్రెషర్ కుక్కర్ (Cooker) పెట్టి కాఫీని విక్రయిస్తున్నాడు. పాలు, కాఫీ పొడి, చక్కెరను ఓ జగ్‌లో వేశాడు. ఆ తర్వాత ప్రెషర్ కుక్కర్‌కు అమర్చిన పైప్‌ను ఆ జగ్‌లో పెట్టాడు. కుక్కర్‌లో నుంచి వచ్చే ఒత్తిడితో కూడిన వేడి గాలికి జగ్‌లోని కాఫీ మరుగుతోంది. ఆ బ్రూయింగ్ పూర్తయిన తర్వాత, అతను కాఫీ (Cooker Wali Coffee)ని డిస్పోజబుల్ గ్లాసుల్లో వేసి సర్వ్ చేస్తున్నాడు. ``మీరు ఎప్పుడైనా కుక్కర్ కాఫీని ప్రయత్నించారా?`` ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.

Viral Video: ఈ స్వీట్ పేరేంటో తెలుసా? దీపావళికి ఈ స్వీట్ చేసుకుని తింటే.. నెటిజన్లు రియాక్షన్లు ఏంటంటే..

ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు 38 లక్షల మందికి పైగా వీక్షించారు. 1.2 లక్షల మందికి పైగా లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ``నా చిన్న వయసులో ఇలాంటి కాఫీ తాగాను``, ``50 ఏళ్ల క్రితం బామ్మలు ఇలాగే కాఫీని చేసేవారు``, ``కాఫీని వేడి చేయడానికి స్టార్‌బక్స్‌లో వారు చేసేది ఇదే", ``ఇది కొత్త టెక్నిక్ కాదు కానీ.. ఈ తరానికి కొత్తే`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Updated Date - 2023-11-05T20:58:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising