ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Doctor: ఇలాంటి డాక్టర్లను ఏం చేయాలి..? ఏకంగా 900 అబార్షన్లు చేసేశాడు.. ఓ ఫ్యాక్టరీలో సీక్రెట్‌గా స్కానింగ్ సెంటర్ పెట్టి మరీ..!

ABN, First Publish Date - 2023-12-05T15:24:08+05:30

ఏకంగా 900 అబార్షన్లు చేసి వైద్య వృత్తికే కళంకం తెచ్చాడు.

ఆడపిల్ల జీవితంలో తల్లి కావడం అనేది అపురూపమయిన దశ. ఇష్టం లేకుండా గర్బం దాల్చడం, లింగ నిర్థారణ ద్వారా బిడ్డ ఆడ అని తెలియడం, కుటుంబ సభ్యుల ఒత్తిడి.. ఇలా కారణాలు ఏవైనా సరే చాలామంది మహిళలు తమ కడుపులో పిండాన్ని తీయించుకోవడానికి సిద్దపడతారు. అయితే ఇవి చట్టపరంగా చేయడం నేరం. ఏవైనా ఆసుపత్రులలో ఇలాంటివి జరిగినా కఠిన చర్యలు తీసుకుంటారు. కానీ ఓ వైద్యుడు మాత్రం తప్పు దారిలోకి వెళ్లాడు. ఫ్యాక్టరీనే అబార్షన్ కేంద్రంగా మార్చేశాడు. ఒకటి రెండూ కాదు ఏకంగా 900 అబార్షన్లు చేసేశాడు. ఈ విషయం ఎవ్వరూ కనుక్కోరులే అని ధీమాగా డబ్బు పోగేసుకున్నాడు. కానీ అతని బండారం బయట పడనే పడింది. కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకున్న ఈ సంఘనకు సంబంధించి వివరాల్లోకి వెళితే..

కర్ణాటక(Karnataka) రాష్ట్రం బెంగళూరులో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. గత నెలలో మైసూరు సమీపంలో మాండ్య పట్టణంలో ఇద్దరు వ్యక్తులు ఓ గర్భిణిని కారులో తరలిస్తుండగా పోలీసులు కారు అడ్డుకున్నారు. ఆమెను అబార్షన్ కు తీసుకెళ్తుండటంతో వారు పోలీసులను చూసి భయపడ్డారు. పొంతనలేని సమాధానాలు ఇవ్వడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. తమదైన శైలిలో విచారణ చేయగా మహిళకు లింగ నిర్థారణ, అబార్షన్ కోసం తీసుకెళ్తున్నట్టు వారు చెప్పారు. మాండ్యలో ఉన్న ఒక బెల్లం ఫ్యాక్టరీలోనే అల్ట్రాసౌండ్ స్కానింగ్, అబార్షన్ పనులు జరుగుతున్నాయని తెలియడంతో పోలీసులు షాకయ్యారు. వెంటనే అక్కడికి చేరుకుని ఫ్యాక్టరీని పరిశీలించారు. ఫ్యాక్టరీలో దృవీకరణ పత్రం లేని అల్ట్రాసౌండ్ స్కానింగ్ మెషిన్ ను పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.

ఇది కూడా చదవండి: చపాతీలు, బెల్లం.. ఈ వింత కాంబినేషన్ వల్ల లాభమేంటంటే..!


ఈ అబార్షన్ తతంగాన్ని డాక్టర్ చందన్ బల్లాల్, ల్యాబ్ టెక్నీషియన్ నిసార్ సహాయంతో నడుపుతున్నట్టు తెలిసింది. మొదట ఆ ఫ్యాక్టరీలో నడుస్తున్న అబార్షన్ హాస్పిటల్ మేనేజర్ మీనా, రిసెప్షనిస్ట్ గా పనిచేస్తున్న రిజ్మా ఖాన్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తరువాత డాక్టర్ చందన్ బల్లాల్, ల్యాబ్ టెక్నీషియన్ నిసార్ లను అదుపులోకి తీసుకున్నారు. వీరు గత మూడేళ్లలో 900 అబార్షన్లు చేసినట్టు బయటపడింది. ఒక్కొక్క అబార్షన్ కు రూ. 30వేలు వసూలు చేశారని తెలిసింది. ఈ అబార్షన్ రాకెట్ వెనుక ఇంకా ఎవరెవరున్నారో.. వీరికి సహాయపడుతున్నది ఎవరనే విషయం దిశగా పోలీసులు విచారణ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: Marriage: నువ్వు ప్రేమించింది ఇలాంటోడినా తల్లీ.. ఆస్పత్రిలో తప్పుడు ఫోన్ నెంబర్ ఇచ్చి మరీ భర్త ఎస్కేప్.. చివరకు..!


Updated Date - 2023-12-05T15:24:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising